ఐపీఎల్ వేలం : హిస్టరీలోనే అత్యధిక ధర?

praveen

సౌదీ అరేబియాలోని జెడ్డాలో తాజాగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ప్రారంభమైంది. మొదటిసారిగా మెడిల్‌ ఈస్ట్ కంట్రీలో ఐపీఎల్ ఆక్షన్ జరుగుతుండటం విశేషం. ఈ వేలం నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 577 మంది క్రికెటర్లు ఈ ఆక్షన్‌లో పాల్గొంటున్నారు. 10 జట్లలో 204 స్థానాలు భర్తీ చేయాలి. ఈ అన్ని జట్లకు కలిపి 641.5 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఈ జట్లలో పంజాబ్ కింగ్స్ దగ్గర అత్యధికంగా 110.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర 83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 73 కోట్లు ఉన్నాయి. ఇంకా, పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ నాలుగు జట్లు తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను వెతుకుతున్నాయి.
ఈ మెగా ఆక్షన్‌లో మొదటి రోజు మార్క్యూ లేదా అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్లు, ఆల్‌రౌండర్లు, వికెట్‌కీపర్లు, బౌలర్లు వేలంలోకి వస్తారు. ఈ రోజు చివరలో అంతర్జాతీయ స్థాయిలో ఆడని కొత్త ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారు.మొదటి రోజు వేలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆటగాళ్లను రెండు సెట్‌లుగా విభజించారు. మొదటి సెట్‌లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జాస్ బట్లర్, అర్షదీప్ సింగ్, కాగిసో రబాడ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. రెండవ సెట్‌లో కెఎల్ రాహుల్, యజువేంద్ర చహల్, లియం లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఈ ఆక్షన్‌లో అత్యధికంగా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా, జట్లు తమకు ఇష్టమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ‘రైట్-టు-మాచ్’ (RTM) కార్డులను కూడా ఉపయోగించుకోవచ్చు.

* ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్!
ఈ ఆక్షన్‌లో మొదటగా, భారతీయ పేసర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టు రిటైన్ చేసుకుంది. అర్షదీప్‌పై అన్ని జట్ల నుంచి భారీ పోటీ ఉండటంతో ఆయన ధర రూ.18 కోట్లకు చేరుకుంది. పీబీకేఎస్ తమ జట్టులో అర్షదీప్ ఉండాలని కోరుకున్నందున ‘రైట్ టు మ్యాచ్’ (RTM) కార్డును ఉపయోగించి ఆయన్ని తమ జట్టులో చేర్చుకుంది. అయితే, ఈ ఆక్షన్‌లో అతిపెద్ద సంచలనం ఏంటంటే, భారతీయ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను పీబీకేఎస్ జట్టు 26.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ కోసం వెచ్చించిన అత్యధిక ధర ఇదే. ఈ ఇద్దరి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి పీబీకేఎస్ జట్టు మొత్తం రూ.44.75 కోట్ల ఖర్చు చేసింది.
శ్రేయస్ అయ్యర్‌ను 26.75 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ అత్యధిక ధరకు కారణం శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ, అద్భుతమైన ఆట అని చెప్పుకోవచ్చు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మూడవసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిపించిన తర్వాత ఆయన్ని జట్టు నుంచి విడుదల చేయడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. దీంతో అన్ని జట్లు శ్రేయస్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి పోటీపడ్డాయి. ముఖ్యంగా 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన నాయకుడుగా శ్రేయస్‌ను అందరూ గుర్తించారు. అతని నాయకత్వం, ఆట ప్రతిభను గమనించి పంజాబ్ కింగ్స్ జట్టు అతనిపై భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఫలితంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: