ఐపీఎల్ : తెలుగోళ్ళపై ధోని కన్ను.. CSK లోకి సెలెక్ట్?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడినే కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి అటు అన్ని ఫ్రాంచైజీలు  కూడా రిటెన్షన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల అందరూ ఎదురు చూస్తున్న ఐపిఎల్ వేలం కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలాగానే అన్ని ఫ్రాంచైజీలు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి జట్టుకు ఉపయోగపడతారు అన్న ఆటగాళ్లను భారీ ధర వెచ్చించి మరి తీసుకున్నారు. ఎప్పటిలాగానే యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసాయి అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే అటు ఐపిఎల్ హిస్టరీ లోనే ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ లోకి రాబోయే ఆటగాడు ఎవరు అనే విషయంపై ఎంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక జట్టులోకి ఎవరు రావాలన్నా దాని వెనుక ధోని వ్యూహం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఇటీవల జరిగిన మెగా వేలంలో ధోని ఎలాంటి వ్యూహాలతో ఫ్రాంచైజీని సిద్ధం చేశాడు. ఇక ఎవరిని జట్టులోకి తీసుకోబోతున్నాడు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ధోని అటు ఒక యంగ్ తెలుగు క్రికెటర్ పై కన్నేసాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ ను చెన్నై జట్టు కొనుగోలు చేసింది.
 ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఏపీలోనే గుంటూరు జిల్లా క్రికెటర్ షేక్ రషీద్ ని చెన్నై కొనుగోలు చేసింది. 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ కి అతడిని దక్కించుకుంది. మరో తెలుగు ఆటగాడు అయినా అవనీష్ ఆరవెల్లి మాత్రం అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఆయనను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇక మరో యువ ఆటగాడు అయినా అన్షుల్ కాంబోజ్ ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ 3.4 కోట్లు పెట్టి భారీ ధరకు కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ధోని ఇలా ప్రత్యేకమైన వ్యూహంతో తెలుగు యంగ్ క్రికెటర్ అని కొనుగోలు చేయడంతో తెలుగు ఫ్యాన్స్ అందరు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: