పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ యాక్సెప్ట్ చేస్తుందా.. ఐసీసీ స్టన్నింగ్ ఆఫర్!

praveen
2025లో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. దీనికి కారణం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ)లు ఒక నిర్ణయానికి రాకపోవడమే అని చెప్పుకోవచ్చు. సమస్య ఏమిటంటే, భారత క్రికెట్ బోర్డ్ పాకిస్తాన్‌కు తమ జట్టును పంపడానికి నిరాకరిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగాలని కోరుతోంది. కొన్ని మ్యాచ్‌లు యూఏఈ లాంటి మరొక దేశంలో జరగాలని బీసీసీఐ కోరుతున్నందున, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు.
అలా 2025 చాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుందనే విషయంలో ఐసీసీ, బీసీసీఐ, పీసీబీల మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌కు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా పెద్ద ఆఫర్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ను ఈ ఆఫర్ టెంప్ట్ చేయవచ్చు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కొన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ వెలుపల జరగాలనే ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. భారత్ పాకిస్తాన్‌కు రాకపోతే అది భారత్‌ సమస్య అని, మిగతా ఆరు జట్లు పాకిస్తాన్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంటోంది. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే గ్రూప్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కోరుతోంది.
మరోవైపు, భారత క్రికెట్ బోర్డ్ భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ సహా, దుబాయ్‌లో జరగాలని కోరుతోంది. భారత్ సెమీఫైనల్‌కు చేరితే, ఫైనల్ కూడా దుబాయ్‌లో జరగాలని భారత క్రికెట్ బోర్డ్ అభిప్రాయపడుతోంది. 2025లో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడానికి ఐసీసీ అధికారులు మంగళవారం ఒక ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత కూడా టోర్నమెంట్ ఎలా జరుగుతుందనే దానిపై స్పష్టమైన నిర్ణయం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహసిన నక్వి ఈ ఆలస్యం గురించి ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: