సక్సెస్ అంటే ఇది.. అప్పుడు అభిమానిగా.. ఇప్పుడు కోహ్లీ తోటి ఆటగాడిగా?
నవంబర్ 22న, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి టెస్ట్ క్యాప్ అందించారు. తద్వారా అతని ప్రతిభను గుర్తించారు. ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన అనేక మ్యాచ్‌లలో తన అద్భుత ప్రదర్శనతో ప్రసిద్ధి చెందిన కోహ్లి, నితీష్‌కు అభినందనలు తెలిపాడు. దేశీయ క్రికెట్‌లో సాధించిన విజయాలను ప్రశంసించారు.
"నితీష్, ఇక్కడికి రావడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. నీకు శిక్షణ ఇస్తున్నప్పుడు చూస్తే, నువ్వు ఈ క్షణాన్ని నిజంగా అర్హుడవు అని నాకు అర్థమైంది. భారతదేశం తరఫున టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది." అని కోహ్లి నితీష్‌తో అన్నారు. కోహ్లీ, ఈ యువ ప్లేయర్ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత, నితీష్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకున్నాడు. "నా కల నేరవేరింది. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం, భారతదేశం తరఫున ఆడటం నాకు గర్వకారకం" అని ఆయన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. నితీష్ రెడ్డి, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జరిగిన ఇండియా ఎ సిరీస్ తనకు ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. "ఇండియా ఎ సిరీస్ ఆడటం వల్ల నేను ఈ పరిస్థితులకు అలవాటు పడగలిగాను" అని నితీష్ అన్నాడు.