మేం కూడా వెళ్లం.. PCB షాకింగ్ డెసిషన్?
ఆయన మాట్లాడుతూ.. "పాకిస్తాన్ క్రికెట్‌కు మేం మంచి చేయాలని నేను బలంగా నిర్ణయించుకున్నా. ఐసీసీ చైర్మన్‌తో నేను రోజూ మాట్లాడుతున్నా, భారత్ ఇక్కడ ఆడటానికి నిరాకరించినప్పుడు పాకిస్తాన్ భారతదేశంలో క్రికెట్ ఆడటం కూడా సరైనది కాదని మేం భావిస్తున్నాం. ఈ విషయాన్ని ఐసీసీకి చాలా స్పష్టంగా చెప్పాం. మీ బెల్లము అని ఖరాకండిగా తెలిపాం. నెక్స్ట్ ఏమి జరుగుతుందో మీకు తెలియజేస్తాము." అని అన్నారు. నక్వి ఇంకా బీసీసీఐ నుండి భారతదేశం పాకిస్తాన్‌కు రాదని ఏ విధమైన అధికారిక సమాచారం తమకు అందలేదని కూడా ధృవీకరించారు.
"మేం ఏమి చేసినా, పాకిస్తాన్‌కు మంచి చేయడానికే కృషి చేస్తాము. కానీ నేను మరోసారి చెప్తున్నా టీమిండియా ఇక్కడికి కాకపోతే పార్టీ కూడా అక్కడికి రాదు." అని ఆయన కుండబద్దలు కొట్టేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చించడానికి, టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఖరారు చేయడానికి నవంబర్ 29 న ICC బోర్డు ఓ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్థాన్‌కు ఉంది, అయితే తన జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ గందరుగోళంలో పడేసింది. PCB "హైబ్రిడ్ మోడల్"ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే తెలిపింది. అంతేకాదు టీమిండియా వాళ్లకి తాము కట్టుదిట్టమైన భద్రత అందిస్తామని కూడా మాటిచ్చింది.