భార్యతో ధోని సూపర్ డాన్స్.. వీడియో వైరల్?
అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కెప్టెన్ గా కూడా భారత క్రికెట్ ప్రేక్షకుల హృదయాలకు ఎంతగానో దగ్గర అయ్యాడు. అందుకే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇక ధోనికి ఉన్న క్రేజ్ మాత్రం కొంచమైనా తగ్గలేదు. ఇప్పటికీ కూడా ధోనిని విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ధోని ఒక్కసారి మైదానంలో కనిపిస్తే చాలు అని కోరుకునే ప్రేక్షకులు కోట్లలోనే ఉంటారు. కాగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతూ తన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు ధోని.
ఇకపోతే సోషల్ మీడియాలో ధోని పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ ధోనికి సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవల మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షితో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసేందుకు అభిమనులు తెగ ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ధోని కుటుంబంతో సహా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా అక్కడి స్థానికులతో కలిసి ఫహాదీ సాంగుకు ధోని తన భార్య సాక్షితో కలిసి కాలు కదిపారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారింది.