WTC : పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ కి చేరాలంటే సమీకరణాలివే..?

frame WTC : పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ కి చేరాలంటే సమీకరణాలివే..?

Pulgam Srinivas
ఐ సీ సీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్లు పట్టిక ఉత్కంఠను రేపుతుంది . దాని తో టాప్ 2 ప్లేసులో ఏ జట్లు నిలుస్తాయో అనే ఆసక్తి జనాల్లో రేకత్తుతుంది . ఇక టీమిండియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్లు పట్టిక లో మొదటి స్థానంలోకి రావాలి అంటే అనేక సమీకరణాలు ఉన్నాయి . బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ లో ఇండియా జట్టు అద్భుతమైన విజయం సాధించడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్లు పట్టికలో ఇండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది . ఆ తర్వాత పింక్ బాల్ టెస్టు లో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడంతో ఒక్క సారిగా భారత జట్టు మూడవ స్థానానికి పడిపోయింది. దానితో భారత జట్టు నెంబర్ 1 స్థానానికి చేరాలి అంటే చాలా సమీకరణాలు ఉన్నాయి. ఆ సమీకరణాలు ఏమిటో తెలుసుకుందాం.

భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో ఆడబోయే మూడు మ్యాచ్ లలో మూడు గెలుపొందినట్లయితే 64.04 శాతంతో టీమ్ ఇండియా ముందుకెళ్తుంది. ఆస్ట్రేలియా 55.26 శాతం కన్నా ఎక్కువ సాధించలేదు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు 63.33 శాతంతో నెం.1 స్ధానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ పాకిస్తాన్ తో మ్యాచ్ లను ఆడనుంది. ఇందులో సౌత్ ఆఫ్రికా కేవలం ఒక మ్యాచ్ గనుక గెలిచినట్లయితే సౌత్ ఆఫ్రికా జట్టుకి 61.11 పాయింట్లు ఉంటాయి. అలా జరిగిన కూడా ఇండియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇండియా పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలవడానికి అనేక సమీకరణాలు ఉన్నాయి. మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్లు పట్టికలో ఇండియా ఏ స్థానంలో ఉంటుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: