WTC ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. టీమిండియా ఏం చేయాలి?
అవును, అయితే ఇక్కడ కాస్త సంతోషించదగ్గ విషయం ఏమిటంటే... 3వ టెస్ట్ డ్రాగా ముగిసినప్పటికీ WTC ఫైనల్ 2025 చేరే అవకాశాలు లేకేపోలేదు. అయితే తరువాత జరగబోయే మిగతా 2 టెస్టుల్లో మాత్రం భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది మరి. ఇక గబ్బాలో భారత్ ఓడిపోతే, 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎలా ఉంటుంది అనే అంశం మీద చర్చలు నడుస్తున్నాయి.
ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసులో దక్షిణాఫ్రికా, భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63.33 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 60.71 శాతం, టీమ్ ఇండియా 57.29 శాతం మార్కులతో మూడో స్థానంలో ఉన్నాయనే విషయం తెలిసినదే. గబ్బా టెస్టులో టీమిండియా ఓడిపోతే మూడో స్థానంలో నిలిచినా పాయింట్లు తగ్గుతాయి. ఆ తర్వాత, సిరీస్‌లోని మిగిలిన 2 మ్యాచ్‌లను టీమిండియా గెలిస్తే, దాని పాయింట్లు 58.8%, ఆస్ట్రేలియా పాయింట్లు 57%గా ఉంటాయి. ఆ తర్వాత భారత్ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలుస్తాయి. భారత జట్టు మరే ఇతర జట్టుపై ఆధారపడకుండా నేరుగా WTC ఫైనల్ 2025లోకి ప్రవేశించాలనుకుంటే, గబ్బా టెస్ట్‌లో విజయం సాధించాల్సి ఉంటుందన్నమాట.