క్రికెట్ ఫ్యాన్స్ కి 2024 బ్యాడ్ ఇయర్.. ఎంతమంది రిటైర్మెంట్ ప్రకటించారో తెలుసా?

praveen
2024 సంవత్సరానికి టాటా చెప్పడానికి ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది క్రికెట్‌ ప్రపంచంలో చూసుకుంటే ఎన్నో స్మృతులు దాగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుందనే చెప్పుకోవాలి. అవును, సరిగ్గా 11 ఏళ్ల పరిశ్రమ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అంతేకాకుండా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ ఓటమి వంటి చేదు జ్ఞాపకాలను కూడా మూటగట్టుకుంది.
ఇక మొత్తంగా చుకుంటే ఈ ఏడాది 28 మంది ప్రముఖ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం కొసమెరుపు. ఇందులో కొందరు కొన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకగా, మరికొందరు ఆట మొత్తానికి గుడ్‌బై పలకడం గమనార్హం. తాజాగా టీమిండియా సీనియర్ ఆటగాడు అశ్విన్ రవిచంద్రన్ దాదాపు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడాభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లు ప్రపంచకప్‌ను ముద్దాడి టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ పలికిన సంగతి విదితమే.
ఇక సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ కూడా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి విదితమే. డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు సారథిగా కూడా బాధ్యతలు వహించాడు. అదేవిధంగా గతేడాది జూన్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్, ఈ సంవత్సరం ఆరంభంలో వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఆ తరువాత టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు.
2024లో రిటైర్మెంట్ పలికిన ఆటగాళ్లు:
డీన్ ఎల్గర్ (అన్ని ఫార్మాట్లు)
డేవిడ్ వార్నర్ (అన్ని ఫార్మాట్లు)
హెన్రిచ్ క్లాసెన్ (టెస్టులు)
దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)
కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)
విరాట్ కోహ్లి (టీ20లు)
రోహిత్ శర్మ (టీ20లు)
రవీంద్ర జడేజా (టీ20లు)
జేమ్స్ అండర్సన్ (అన్ని ఫార్మాట్లు)
శిఖర్ ధావన్ (అన్ని ఫార్మాట్లు)
డేవిడ్ మలన్ (అన్ని ఫార్మాట్లు)
మొయిన్ అలీ (అన్ని ఫార్మాట్లు)
షకిబ్ అల్ హసన్ (టెస్టులు-టీ20లు)
మహ్మదుల్లా (టీ20లు)
మాథ్యూ వేడ్ (అన్ని ఫార్మాట్లు)
వృద్ధిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)
సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)
వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)
నేల్ వాగ్నర్ (అన్ని ఫార్మాట్లు)
కొలిన్ మున్రో (అన్ని ఫార్మాట్లు)
డేవిడ్ వైస్ (అన్ని ఫార్మాట్లు)
సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (అన్ని ఫార్మాట్లు)
బ్రెయిన్ మసాబా (టీ20లు)
షానన్ గాబ్రియెల్ (అన్ని ఫార్మాట్లు)
విల్ పుకోవ్సీకీ (అన్ని ఫార్మాట్లు)
బరిందర్ శ్రాన్ (అన్ని ఫార్మాట్లు)
సిద్ధార్థ్ కౌల్ (దేశవాళీ క్రికెట్)
అశ్విన్ రవిచంద్రన్ (అన్ని ఫార్మాట్లు)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: