చాంపియన్స్ ట్రోఫీ: IND vs PAK.. మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
ఇక మీడియా నివేదికల ప్రకారం చూసుకుంటే... రెండు జట్లు ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తలపడనున్నాయని సమాచారం. గతంలో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి విదితమే. సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాక్ జట్టు 180 పరుగుల తేడాతో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాను ఓడించి టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఓటమికి ధీటుగా సమాధానం చెప్పేందుకు టీమిండియా కసరత్తులు చేస్తోంది. అయితే, టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించలేదు.
అవును, ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మరికొన్ని రోజుల్లో ప్రకటించే చాన్సు ఉంది. ఇతర జట్లు మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో ఆడతాయి. ఒకవేళ టీమిండియా సెమీఫైనల్, ఫైనల్స్‌కు చేరినా.. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది కాకుండా, 2024-27 సైకిల్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే అన్ని మ్యాచ్‌లు, రెండు దేశాలలో ఏది ఆతిథ్యం ఇస్తుందో దానికి భిన్నంగా, ఇరుజట్లు తటస్థ వేదికల్లో ఆడనున్నాయని తెలుస్తోంది. అంటే, భవిష్యత్తులో ఏదైనా టోర్నమెంట్ జరిగి, దానికి భారత్ ఆతిథ్యం ఇస్తే, పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడనుందన్నమాట. ఇది పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు కూడా వర్తించబోతున్నట్టు తెలుస్తోంది. ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025ని నిర్వహించే అవకాశం మాత్రం భారత్ చేతిలో ఉంది. కాగా, టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంకలు నిర్వహించనున్నాయి.