షాక్: విడాకులు తీసుకోబోతున్న స్టార్ క్రికెటర్.. నిరాశలో ఫ్యాన్స్..!

Divya
ఈమధ్య ఎక్కువగా సినీ సెలబ్రిటీలే కాకుండా స్టార్ క్రికెటర్లు కూడా విడాకులు బాట పడుతున్నారు. ఇటీవలే హార్దిక్ - నటాషా విడాకులు తీసుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు మరొక స్టార్ క్రికెటర్ కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్త ఎక్కువగా వినిపిస్తోంది. అది ఎవరో కాదు టీమిండియా ప్లేయర్ చాహల్.. ఇప్పటికే టీమ్ ఇండియాకు సైతం దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తన భార్య ధన్ శ్రీ వర్మతో మనస్పర్దలు వచ్చినట్లుగా సమాచారం.

చాహల్- ధన్ శ్రీ వివాహం జరిగి ఇప్పటికీ నాలుగేళ్లు పూర్తి అయిందట .సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వీరు కనీసం వెడ్డింగ్ కి సంబంధించి ఎలాంటి పోస్టులను కూడా తెలుపుకోలేదట.. దీంతో వీరిద్దరు విడిపోతున్నారని ప్రచారానికి మరింత బీజం వేసింది. 2020 కరోనా సమయంలో చాహల్ , ధన్ శ్రీ పరిచయమయ్యారని వీరిద్దరూ 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్నారట. దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా జీవించిన వీరు పెళ్లి రోజు ,పుట్టినరోజు వేడుకలను సైతం ఒకరినొకరు విషెస్ చేసుకుంటూ తమ ప్రేమను చాటుకునేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటివి ఏమీ చేయకపోవడంతో అభిమానులకు కూడా ఈ విషయం పైన కాస్త నిరాశలో ఉన్నారు.

చాహల్- ధనుశ్రీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. అయినప్పటికీ తమ పెళ్ళి రోజున ఇద్దరు కూడా విష్ చేసుకోకపోవడంతో అనుమానం మొదలవుతుంది. ఇక బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన క్రిటిక్ KRK డిసెంబర్ 22న ఈ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన చేసిన పోస్టులు ఎంత నిజం ఉంటాయో తెలియదు కానీ.. గత కొన్ని నెలలుగా చాహాల్ , ధన్ శ్రీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు చూస్తూ ఉంటే వీరి విడాకులు తీసుకోబోతున్నారని పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి కూడా ఎక్కడ ఈ మధ్యకాలంలో ఫోటో దిగినట్లుగా కనిపించడం లేదట. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: