అఫ్గనిస్తాన్ టెస్టుల్లో రికార్డ్ సృష్టించింది కానీ, ఉపయోగం లేదంటున్నారు.. ఎందుకంటే?
అయినా వారికి ఉపయోగం లేకుండా పోయింది మరి! విషయం ఏమిటంటే... ఆఖరికి 113 పరుగులతో వెనుకబడి 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఇక్కడ లేకపోవడం వలన 2 జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించక తప్పలేదు. అయితే రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను మాత్రం అలరించిందనే చెప్పుకోవాలి. ఇకపోతే జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించిన సంగతి విదితమే. కాగా 3 టీ20, 3 వన్డే, 2 టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
జింబాబ్వే vs అఫ్గనిస్తాన్ తొలి టెస్టు - Dec 26-30
వేదిక - క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
టాస్ - జింబాబ్వే (మొదట బ్యాటింగ్)
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు - 586
అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు - 699
జింబాబ్వే 2వ ఇన్నింగ్స్ స్కోరు - 142/4
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - హష్మతుల్లా షాహిది (అఫ్గనిస్తాన్ - 474 బంతుల్లో 246 పరుగులు)