ప్రస్తుతం క్రికెట్ వర్గంలో చూసుకుంటే చాహల్ - ధనశ్రీ జంట విడాకుల విషయం ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. దానికి కారణం లేకపోలేదు! యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో వదిలిన ఓ కొత్త పోస్ట్ చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల పుకార్లకు మరింత బలాన్ని చేకూరేలా చేస్తోంది. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ధనశ్రీతో ఉన్న చిత్రాలను తొలగించిన తరువాత వీరు ఇక విడిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే ఒక విషయం మరికొంతమందిని కొన్ని అనుమానాలకు ఊతమిస్తోంది. ధనశ్రీ మాత్రం చాహల్‌తో ఉన్న తన చిత్రాలను ఇప్పటికీ తన సోషల్ మీడియాలోనే ఉంచింది. దాంతో అభిమానులు చాలా గందరగోళానికి గురవుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే... తాజాగా చాహల్ “అన్ని రకాల శబ్దాలు వినగలిగే వారికి, నిశ్శబ్దం ఒక లోతైన శ్రావ్య సంగీతంలా తోస్తుంది!” అంటూ ఒక నిగూఢమైన కోట్‌ను షేర్ చేసాడు. దాంతో ఇది అతని అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. ప్రేమ కారణంగా 2020లో వివాహంతో ఒక్కటైన ఈ జంట, సోషల్ మీడియా వేదికలపై అత్యంత ప్రజాదరణ పొందింది. కానీ, ప్రస్తుతం ఇద్దరూ తమ సంబంధంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు కనిపించడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఆగస్ట్ 8, 2020న నిశ్చితార్థం చేసుకున్న చాహల్, డిసెంబర్ 22న గుర్గావ్‌లో ధనశ్రీతో వివాహం జరుపుకున్నారు. వారి ప్రేమ కథ అభిమానులకు ఆదర్శంగా నిలిచినప్పటికీ, ప్రస్తుతం వారి సంబంధం గూర్చిన పుకార్లు ఒకింత కలవర పెడుతున్నాయి.
మరోవైపు తాజాగా చాహల్, తన రహస్య ప్రేమికురాలు తనిష్క కపూర్ తో కలిపి ఓ హోటల్లో అడ్డంగా బుక్కవడంతో తప్పంతా చాహల్ వైపే ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. తనిష్క కపూర్ కారణంగానే ధనశ్రీ, చాహల్ కి దూరమైనట్టు తెలుస్తోంది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ, నిన్నటికి నిన్న తప్పంతా ధనశ్రీ వైపే ఉందని పుకార్లు షికారు చేస్తే, ఇపుడు మాత్రం లేదు... తప్పంతా చాహల్ వైపే ఉందని కధనాలు వెలువడుతున్నాయి. మరి, మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ కామెంట్ చేయండి!