
రంజీలో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. రోజు జీతం ఎంతో తెలుసా?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రంజీ మ్యాచ్ కోసం కోహ్లీ రోజుకు రూ. 60 వేల జీతం తీసుకోనున్నాడని టాక్ నడుస్తోంది. మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి మొత్తం రూ .2లక్షల 40 వేల పారితోషకాన్ని అందుకోనున్నాడన్నమాట. వివరాల్లోకి వెళితే, 40 కంటే ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.60,000 పారితోషికం ఉండగా.. 21-40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.50,000, 20 కంటే తక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.40,000 వరకు ఇవ్వనున్నారు. ఇక జట్టుకు ఎంపికై ఆడని సభ్యులకు వారి అనుభవ స్థాయి ఆధారంగా రోజుకు రూ.20,000 నుండి రూ.30,000 వరకు అందుకోనున్నారు.
కోహ్లీ ఇప్పటి వరకు డొమెస్టిక్ సర్క్యూట్లో 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 23 రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. రంజీ ట్రోఫీ ఆటగాళ్లకు వారి అనుభవం, వారు ఆడిన ఫస్ట్ - క్లాస్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారం చేసుకొని వేతనాన్ని ఇవ్వనున్నారు. కాగా రైల్వేస్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కోహ్లీ దారుణమైన ఆటతీరుని కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన కోహ్లీ 15 బంతులకు గాను కేవలం 6 పరుగులు మాత్రమే చేసి సంగ్వాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యి, పెవిలియన్ చేరాడు.