క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మల్టీప్లెక్స్‌లలో CT ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు?
ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ మ్యాచ్‌ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. ఏసీ గాలిలో కూర్చొని, పాప్‌కార్న్ నంజుకుంటూ పెద్ద స్క్రీన్‌పై మ్యాచ్ చూసేయొచ్చు. సినిమా చూసినట్టే ఉంటది కానీ క్రికెట్ మజా వేరే లెవెల్ కదా. థియేటర్స్ వాళ్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసేశారు, టికెట్లు కూడా బుక్‌మైషోలో దొరుకుతున్నాయి.
హైదరాబాద్ థియేటర్లు యజమానులు లైవ్ క్రికెట్‌ను బిగ్ స్క్రీన్‌పై చూపిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంట్లోనో, బయట ఎక్కడో పెద్ద స్క్రీన్ పెట్టుకొని చూసేదానికి, థియేటర్‌లో చూసేదానికి చాలా తేడా ఉంటది. ఆ భారీ స్క్రీన్, స్టేడియం వైబ్స్, అందరూ కలిసి గోల చేస్తూ ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరప్పా.
అయితే ఇంకా ఏ థియేటర్లలో చూపిస్తారో మాత్రం క్లారిటీ రాలేదు. రేపు డీటెయిల్స్ వస్తాయి. టికెట్ ధరలు ఎంత ఉంటాయో అని కూడా ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. ఫ్రీ ఎంట్రీ పెడితే జనాలు బొక్కలు చేసుకొని వస్తారు. టికెట్లు పెట్టినా కూడా థియేటర్లు మాత్రం ఖాళీగా ఉండవు అంటున్నారు.
ఫైనల్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. టాస్ మాత్రం 2:00 గంటలకు వేస్తారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది కాబట్టి, టీమ్ ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లు తుది జట్టులో ఉండొచ్చు. పేస్ బౌలింగ్ బాధ్యతను మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా తీసుకునే అవకాశం ఉంది. రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్ మాత్రం రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యేలా ఉన్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం హై-వోల్టేజ్ యాక్షన్‌తో అదరగొట్టడం ఖాయం. హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇక మల్టీప్లెక్స్‌లో స్టేడియం ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకెందుకు లేటు? వెంటనే బుక్‌మైషోలో టికెట్లు బుక్ చేసుకోండి.