
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ఒకే మైదానంలో?
కేవలం 3.4 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. మ్యాచ్ మూడో ఓవర్లోనే స్టార్క్ తన ప్రతాపం చూపించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను (2 పరుగులు) క్లీన్ బౌల్డ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. మరో రెండు బంతులకే నితీష్ కుమార్ రెడ్డిని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపాడు. అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ సురక్షితంగా అందుకున్నాడు.
ఆ తర్వాతి ఓవర్లో స్టార్క్ మరో కీలక వికెట్ పడగొట్టాడు. విధ్వంసకర బ్యాటర్, ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను (12 బంతుల్లో 22 పరుగులు) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టార్క్ తన ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేశాడు. ఆ ఓవర్లో హర్షల్ పటేల్ (5)ను అక్షర్ పటేల్ క్యాచ్ ద్వారా, ఆ తర్వాతి బంతికే వియాన్ ముల్డర్‌ను (9) ఫాఫ్ డు ప్లెసిస్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి ఎస్ఆర్‌హెచ్ పతనానికి చెక్ పెట్టాడు.
విశేషమేమిటంటే, ఐపీఎల్‌లోనే కాదు, మొత్తం టీ20 క్రికెట్‌లోనూ మిచెల్ స్టార్క్‌కి ఇదే మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం గమనార్హం. ఈ అద్భుత ప్రదర్శనతో అతను టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని కూడా దాటాడు. ఇప్పటివరకు 144 మ్యాచ్‌ల్లో స్టార్క్ ఖాతాలో 201 టీ20 వికెట్లు ఉన్నాయి.
డీసీ తరఫున రెండో బౌలర్‌గా..
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఇంతకుముందు 2008లో అమిత్ మిశ్రా డెక్కన్ చార్జర్స్‌పై 17 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో డీసీ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనలు:
5/17 – అమిత్ మిశ్రా vs డెక్కన్ చార్జర్స్ (ఢిల్లీ, 2008)
5/35 – మిచెల్ స్టార్క్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (విశాఖపట్నం, 2025)*
4/11 – అమిత్ మిశ్రా vs కింగ్స్ XI పంజాబ్ (ఢిల్లీ, 2016)
4/14 – కుల్దీప్ యాదవ్ vs KKR (వాంఖడే, 2022)
4/15 – రజత్ భాటియా vs డెక్కన్ చార్జర్స్ (డర్బన్, 2009)