ఒక్క మ్యాచ్ తో ధోని ఎన్ని రికార్డులు సాధించాడో తెలుసా

frame ఒక్క మ్యాచ్ తో ధోని ఎన్ని రికార్డులు సాధించాడో తెలుసా

praveen
చాలా గ్యాప్ తరువాత అందరి విమర్శకుల నోళ్లను మూయిస్తూ... నిన్న (ఏప్రిల్ 14) ఎల్ఎస్‌జీ (ల‌క్నో సూప‌ర్ జెయింట్స్)తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే (చెన్నై సూప‌ర్ కింగ్స్) కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను కనబరిచాడు. ఈ క్రమంలో చెన్నై విజయంలో ధోనీ కీల‌క‌ పాత్ర పోషించాడు. కీపింగ్‌లో త‌న‌దైన‌శైలిలో అద‌ర‌గొట్టిన ఎంఎస్‌డీ... బ్యాటింగ్‌లో కూడా తనదైన మార్క్ ఆటని ఆడడం జరిగింది. మొత్తం 11 బంతుల్లోనే 26 ప‌రుగులు చేసి, 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' (పీఓటీఎం) అవార్డుని అందుకున్నాడు.

దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ అవార్డు అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయ‌ర్ (43 ఏళ్ల 281 రోజులు)గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. అంత‌కు మునుపు ఈ రికార్డు స్పిన్న‌ర్ ప్ర‌వీణ్ తాంబే (43 ఏళ్ల 60 రోజులు) పేరిట ఉండేది. అయితే రికార్డుల పరంపర దానితో ఆగలేదు. సదరు మ్యాచ్‌లో మ‌హేంద్రుడు రికార్డుల మీద రికార్డులు న‌మోదు చేశాడు. ఐపీఎల్‌లో 200 ఔట్స్ (స్టంపౌట్లు, ర‌నౌట్లు, క్యాచ్‌లు) చేసిన తొలి వికెట్ కీప‌ర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్య‌ధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్స‌ర్లు కొట్టిన బ్యాట‌ర్‌గానూ అరుదైన రికార్డును త‌న ఖాతాలో లిఖించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్య‌ధిసార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన రెండో ఆట‌గాడిగా కూడా అవతరించి యువతకి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్ప‌టివ‌రకు ధోనీకి 18 పీఓటీఎం అవార్డులు వ‌చ్చాయి. ఈ జాబితాలో రోహిత్ శ‌ర్మ (19) అగ్ర‌స్థానంలో ఉండడం గమనార్హం.

ఇక వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడిన తర్వాత సీఎస్కే జట్టు తిరిగి గెలుపు బాటలోకి వచ్చి తన ఉనికిని చాటిచెప్పింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విధంగా ప్రస్తుత సీజన్ లో ఏడో మ్యాచ్ లో సీఎస్కే తన రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డును గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయస్సులో ఎంఎస్ ధోని ప్రవీణ్ తంబే 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడం కొసమెరుపు.

ఐపీఎల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతిపెద్ద వయస్సు ఆటగాళ్లు వీరే:
43 ఏళ్ల 281 రోజులు- ఎంఎస్ ధోని
44 సంవత్సరాల 60 రోజులు - ప్రవీణ్ తంబే
41 సంవత్సరాల 223 రోజులు -షేన్ వార్న్
41 సంవత్సరాల 181 రోజులు -ఆడమ్ గిల్‌క్రిస్ట్
41 సంవత్సరాల 35 రోజులు -క్రిస్ గేల్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: