పహాల్గాం ఉగ్ర దాడిలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది భారత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఉగ్రదాడికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్, పాక్ లోని 9 ఉగ్ర స్థావరాల పైన దాడి చేశారు. ఈ క్రమంలో భారత ఆర్మీకి చెందిన ఐదు ఫైటర్ జట్లను కూల్చేసారని పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు ఆరోపిస్తున్నారు.
దీనికి ఆధారాలు ఉన్నాయా అని పాక్ డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆసిఫ్ ను CNN ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ భారత ఫైటర్ జెట్లు కూలినట్లుగా ఆ దేశపు సోషల్ మీడియాలో వస్తుందన్నారు. అతడు చెప్పిన సమాధానానికి యాంకర్ తో సహా అక్కడి ఉన్న వారంతా షాక్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ నవ్వుల పాలు అయిందంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాగా, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ లో బిగ్ అలర్ట్ జారీ చేశారు. జమ్ము కాశ్మీర్ అంతట కరెంటు తీసేసి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు డ్రోన్లను ఎగురవేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని మన ఇండియన్ ఆర్మీ వాటిని ధ్వంసం చేస్తోంది. జమ్ము కాశ్మీర్ లో ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్పోర్ట్ ను పాకిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు అయింది. యుద్ధం కారణంగా మ్యాచును కూడా ఎన్నడూ లేనివిధంగా ఆపేశారు.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో దాడులు జరిగిన నేపథ్యంలో... మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేశారు. దాడులు జరుగుతున్న నేపథ్యంలో స్టేడియంలో ఎక్కువమంది ఉన్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ఐపిఎల్ 2025 టోర్నమెంట్ కూడా రద్దయ్య ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.