హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : దేశ క్రికెట్ చరిత్రలోనే ఒక బంగారు పేజీ..ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేని మూమెంట్..!
* భారత మహిళా క్రికెట్ దశను మార్చేసిన మహానాయకురాలు.
* నమ్మకం లేని చోట విశ్వాసాన్ని నాటిన కెప్టెన్.
* “మనకూ వరల్డ్ కప్ వస్తుంది” అని కోట్లాది మంది అభిమానులకు నమ్మకం కలిగించిన లెజెండ్.
ఏళ్ల తరబడి భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన ఆ కల… ఎన్నోసార్లు దగ్గరకు వచ్చి చేజారిపోయిన ఆ స్వప్నం… చివరికి 2025లో సాకారమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి శక్తివంతమైన జట్లను ధీటుగా ఎదుర్కొని, ఒక్క అడుగు వెనక్కి వేయకుండా పోరాడి, భారత మహిళల జట్టుకు ఓడీ వరల్డ్ కప్‌ను అందించింది హర్మన్‌ప్రీత్ కౌర్.ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు… ఇది భారత మహిళా క్రికెట్ సాధించిన చరిత్రాత్మక విప్లవం. ఇది తరతరాలుగా ఉన్న “మనం గెలవలేమేమో” అనే సందేహాలకు పెట్టిన ముగింపు.
ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన మొట్టమొదటి భారత మహిళా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర పుస్తకాల్లో తన పేరు శాశ్వతంగా చెక్కించుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది నిజంగా ఒక బంగారు పేజీ. ఒకప్పుడు మహిళల క్రికెట్ అంటే ప్రపంచం మొత్తం గుర్తుచేసుకునే పేరు ఒక్కటే…మెగ్ లానింగ్. ఆమె రికార్డుల్ని చెరిపేయడం అసాధ్యమని అనుకున్నారు. కానీ హర్మన్‌ప్రీత్ కౌర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో ఆమె ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండాను గర్వంగా ఎగరవేసింది. ప్రపంచవ్యాప్తంగా మాజీ క్రికెటర్లు, నిపుణులు, అభిమానులు అందరూ ఒక్క గొంతుతో అన్నారు –
అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే కాదు… దేశీయ లీగ్‌ల్లోనూ హర్మన్ ఆధిపత్యం అదే స్థాయిలో కొనసాగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో.. ముంబై ఇండియన్స్ జట్టును ముందుండి నడిపిస్తూ..ఇప్పటివరకు రెండు సార్లు ట్రోఫీలను గెలిపించిన కెప్టెన్‌గా నిలిచింది. కష్ట సమయాల్లో టీమ్‌ను ఎలా లీడ్ చేయాలి? ఒత్తిడిలోనూ ఎలా గెలుపు దారి చూపించాలి? అన్నది హర్మన్‌ప్రీత్ కౌర్‌ను చూసి నేర్చుకోవాల్సిందే అంటారు క్రికెట్ విశ్లేషకులు.
2025 – రియల్ హీరోస్ లిస్ట్‌లో టాప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ :
ఈ ఏడాది ఎవరు నిజమైన హీరోలు అంటే… స్టేటస్ కాదు, స్టార్డమ్ కాదు.. నాయకత్వం,నమ్మకం, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఘనత
వీటితో కొలిస్తే… హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు ఎటువంటి సందేహం లేకుండా టాప్‌లో ఉంటుంది.
ఆమె ఒక క్రికెటర్ మాత్రమే కాదు… కోట్లాది అమ్మాయిలకు ప్రేరణ, భారత మహిళా క్రికెట్‌కు దిశానిర్దేశం, దేశానికి గర్వకారణం. 2025 ముగిసినా… హర్మన్‌ప్రీత్ కౌర్ రాసిన ఈ చరిత్ర మాత్రం తరతరాలకు గుర్తుండిపోతుంది.