“సెంచరీ” చేసిన కరుణ్..

Bhavannarayana Nch

ఓ పక్క దక్షిణాఫ్రికా టెస్ట్ టూర్ లో ఇండియన్ క్రికెట్ టీం చతికలపడుతోంది..వరుసగా గోరమైన పరాజయాలని చవి చూసింది. మొదటి టెస్టు లో ఓడినా సరే రెండవ టెస్టు లో సత్తా చాటుతారు అనుకుంటే అది విఫలం అయ్యింది..ఇప్పుడు మూడో టెస్టు లో ఆల్ ఔట్ అయ్యి ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచింది..ఇదిలా ఉంటే ఇప్పుడు ముస్తాక్ అలీ టీ20 సూపర్‌లీగ్‌లో మనవాళ్ళు రికార్డులు సృష్టిస్తున్నారు..

 

కర్ణాటక ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ చెలరేగి ఆడాడు 52 బంతుల్లో శతకాన్ని సాధించాడు..ఈ శతకంతో కర్నాటక జట్టు జార్ఖండ్‌పై ఘన విజయంసాధించింది..ముస్తాక్ అలీ టీ20 సూపర్‌లీగ్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ విజ్రుంబించాడు..ఒక్కసారిగా చెలరేగిపోయాడు..8 ఫోర్లు, 7 సిక్సర్ల తో మెరుపులు మెరిపించి శతకం చేశాడు.

 

అయితే ఇతనికి సపోర్ట్ గా దేశ పండే 59 పరుగులు చేసి తన సత్తా చాటాడు..కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా..లక్ష్యాన్ని చేదించడంలో జార్ఖండ్ 14.2 ఓవర్లలోనే 78 పరుగులకే ఆలౌట్ అయ్యి 123 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది..ఇదిలా ఉంటే ఇదే టోర్నీలో “బరోడాపై ఉత్తరప్రదేశ్”...”తమిళనాడుపై బెంగాల్”  గెలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: