కామన్వెల్త్‌లో “చీరలకు చెక్” బదులుగా “కోట్లు”

Bhavannarayana Nch

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రీడలు జరిగినా సరే భారతదేశం నుంచీ పాల్గొనే మహిళా అథ్లెట్ల డ్రెస్‌ కోడ్‌ మాత్రం సాంప్రదాయ పద్దతిలో చీరకట్టుతో నిండుగా ఉంటూ..జెండా చేత బూని..వారు చేసే “మార్చ్ ఫాస్ట్” ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది..ఇదే ఆనవాయితీ కొన్నేళ్ళుగా వస్తోంది అయితే ఈ సాంప్రదాయానికి చెక్ పడింది..

 

ఈ సంవత్సరం జరుగనున్న ఆస్ర్టేలియాలో ని కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ సంప్రదాయం మారనుంది...ఈ టోర్నీ ఆరంభవేడుకలకు భారత క్రీడాకా రిణుల చీరలకు బదులు బ్లేజర్‌  మరియు ట్రౌజర్‌ లతో పాల్గొంటారని భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.. సంప్రదాయానికంటే మహిళా అథ్లెట్ల సౌకర్యానికే భారత ఒలింపిక్‌ సంఘం ఆమోదం తెలిపింది..

 

ఈ క్రీడ్సోతవాల ఆరంభ, ముగింపు వేడుకలలో  చీరలు కట్టుకుని నడవడం మహిళా అథ్లెట్లకు అసౌకర్యంగా ,ఇబ్బందిగా ఉంటోందని..చాలా మందికి చీరలు కట్టుకోవడం కూడా తెలియదని అంటున్నారు..అయితే వారి సౌకర్యం కొరకు వస్త్రధారణలో మార్పు చేయటం మంచిదేనని  అని ష్రాఫ్‌ పేర్కొన్నారు... కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆరంభోత్సవం ఏప్రిల్‌ 4న కెర్రరా స్టేడియంలో జరుగనుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: