"షాకింగ్ ట్వీట్"...కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో

Bhavannarayana Nch

ఏంటి కోహ్లీకి పెళ్లి అయ్యింది కదా మళ్ళీ ఈ ప్రపోజల్ ఏంటి అనుకుంటున్నారా..నిజమేనండి బాబు ఈ షాకింగ్ ట్వీట్ ఇప్పుడు సంచలనం అయ్యింది..ఈ ట్వీట్ పాతదే అయినా మళ్ళీ హీట్ పెంచింది..ఇంతకీ ఏమిటా ప్రపోజల్, ఏంటా కధ అంటే..గతంలో జరిగిన సంఘటనే తెలిసిందే..ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌ పెళ్లి ప్రపోజ్‌ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో..కోహ్లీ అందానికి బౌల్డ్ అయ్యిందో కానీ మొత్తానికి ఈ అమ్మడు కోహ్లీ పై అప్పట్లో మనసు పడేసుకుంది..

 

నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ ట్వీట్ చేయడంతో ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది..అయితే ఈ తంతు జరిగి నాలుగేళ్ళు అవుతోంది.... 2014లో టీమిండియా  జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు...అయితే ఎప్పుడో రేగిన గాయం మళ్ళీ ఎందుకు బయటకి వచ్చింది అంటే..

.

త్వరలో ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌కు రానున్న యాట్‌.. త్వరలో చేపట్టబోయే భారత పర్యటనలో నేను కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతానని మరోసారి స్పష్టం చేసింది...ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన  యాట్‌ విదేశీ పర్యటనలలో కూడా కోహ్లీ ఇచ్చిన బ్యాట్ నే వాడుతున్నాను అని ప్రకటించింది..మార్చ్ 23 నుంచీ జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌ లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు ట్రై సిరీస్‌లో పాల్గొంటాయి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: