నరాలు తెగే ఉత్ఖంట “సన్‌రైజర్స్‌” విజయం

Bhavannarayana Nch

“సన్‌రైజర్స్‌” హైదరాబాద్ జట్టు వరుసగా రెండవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది..అందరి అంచనాలని తలకిందులు చేస్తూ సొంతగడ్డపై నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విజయాన్ని సాధించింది..అయితే ఈ మ్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులు మాత్రం నరాలు తెగిపోయే తీవ్రమైన ఉత్ఖంట కి లోనయ్యారు..ముందుగా బౌలింగ్ చేపట్టిన హైదరాబాదు జట్టు అద్భుతమైన బౌలింగ్ తో 147 పరుగులకే పరిమితం చేశారు..

 

 అయితే ఆ తరువాత లక్ష్య చేధనలో దిగిన శిఖర్‌ ధావన్‌ 45; 28 బంతుల్లో 8 ఫోర్లు కొట్టి మరోమారు తన తడాఖా చూపించాడు దీపక్ హుడా 32 నాటౌట్‌; “25 బంతుల్లో 1 ఫోర్‌ 1 సిక్స్‌” కూడా జట్టు పరుగులు పెరిగేలా స్కోర్ ని పరుగులు పెట్టించాడు..అయితే ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ధావన్ వృద్ధిమాన​ సాహాలు నిలకడగా ఆడుతూ 62 పరుగులు చేయగా 22 వ్యక్తిగత స్కోర్ వద్ద సాహా అవుట్ అయ్యాడు..

 


ఆ తర్వాత మనీష్‌ పాండే(11), షకిబుల్‌ హసన్‌(12)లు ఔట్‌ కావడంతో హైదరాబాద్‌  జట్టు గెలుపు బెంగ పెట్టుకుంది అయితే పఠాన్‌(14) నిలకడగా ఆడుతూ ఉన్న కీలక సమయంలో అవుట్‌ కావడంతో మరింత టెన్షన్ మొదలయ్యింది..ఆ తరువాత బంతికే రషీద్‌ ఖాన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో  హైదరాబాద్‌ 137 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది..ఇక చివరిగా హైదరాబాద్ జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం 11 పరుగులు ఈ తరుణంలో హుడా తొలి బంతిని సిక్స్‌ కొట్టగా, రెండో బంతి వైడ్‌ అయ్యింది. ఆ తర్వాత రెండో బంతికి పరుగు రాకపోగా, మూడో బంతికి పరుగు వచ్చింది.

 


ఇక నాలోగో బంతికి స్టాన్‌ సింగిల్‌ తీసి హుడాకు స్టైకింగ్‌ అందించాడు ఆ తరువాత మరొక సింగల్ చేసి స్టాన్ కి చివరి అవకాశం రాగా బంతిని ఫోర్ రూపంలో బౌండరీ కి పంపి తమ జట్టుకు విజయాన్ని అందించాడు....ముంబై ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(29), కీరోన్‌ పొలార్డ్‌(28), సూర్యకుమార్‌ యాదవ్‌(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, రోహిత్‌ శర్మ(11), కృనాల్‌ పాండ్యా(15)లు నిరాశపరిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో స్టాన్‌లేక్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌, షకిబ్‌ వుల్‌ హసన్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: