అంతర్జాతీయ క్రికెట్ కి “గుడ్ బై”...షాక్ లో “అభిమానులు”

Bhavannarayana Nch

క్రికెట్ అభిమానులకి నిజంగా ఇది చేదు వార్తనే చెప్పాలి..తన అత్యద్భుతమైన ఆటతో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్న సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచీ తప్పుకున్తున్నట్టుగా ప్రకటించాడు..సోషల్ మీడియా వేదికగా తన రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ఓ వీడియోను డివిలియర్స్ షేర్ చేశాడు. ఈ వీడియోలో మాట్లాడిన అతడు  ‘‘ఇది చాలా కఠిన నిర్ణయం కానీ చాలా కాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను అని తెలిపాడు..

 

అయితే నేను ఈ సమయంలోనే తప్పుకోవాలి ఇదే సరైన సమయం అని తెలిపాడు క్రికెట్ సౌతాఫ్రికాకి, నా జట్టు సభ్యులకు, ప్రపంపవ్యాప్తంగా నా వెనుక ఉండి నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ప్రతీ ఒక్కరికి నా పత్యేకమైన ధన్యవాదాలు..అంటూ వీడియో ని ముగించాడు..ఒక్క సారిగా ఈ ప్రకటనతో క్రికెట్ లోకం షాక్ కి గురయ్యింది...2004 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన   టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. ఈ 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏబీడి మొత్తం 50 శతకాలు, 137 అర్థశతాకాలు, 2 శతకాలు సాధించాడు.

 

అయితే తానూ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కి మాత్రమే గుడ్ బై చెప్పానని..డొమెస్టిక్ క్రికెట్‌కి మాత్రం అందుబాటులో ఉంటానని డివిలియర్స్ వీడియోలో పేర్కొన్నాడు...అంతా బాగానే ఉన్నా డివిలియర్స్ రాజీనామా అందరి కంటే కూడా సౌత్ ఆఫ్రికా క్రికెట్ సంఘానికి భారీ షాక్ ఇచ్చింది ఎందుకంటే  2019 ప్రపంచకప్‌కి ముందు డివిలియర్స్ రిటైర్‌మెంట్ ప్రకటించడం సౌతాఫ్రికా జట్టు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: