మళ్ళీ టెస్ట్ ల సందడి..ఐసీసీ సంచలన నిర్ణయం.

Bhavannarayana Nch

ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఫార్మేట్ ల వలన టెస్ట్ ల యొక్క మనుగడ ప్రస్నార్ధకం అయ్యింది ఒకప్పుడు ఆ మధ్య సెహ్వాగ్ మరియు కొంతమంది సీనియర్ క్రీడాకారులు..టెస్ట్ మ్యాచ్ లు అమలు చేసే విషయాన్ని ఒక్క సారి పరిశీలించండి అంటూ విజ్ఞప్తులు కూడా చేశారు..అయితే కొత్తాగా వచ్చిన వన్డే, టీ20ల మాయలో పడి నిర్లక్ష్యానికి గురవుతున్న టెస్టు క్రికెట్‌కి పుర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అడుగులు వేసింది.

 

టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-9లో ఉన్న జట్లు 2019 జూలై 15 నుంచి 2021 ఏప్రిల్ 30లోపు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆడేలా ఐసీసీ షెడ్యూల్ ప్లాన్ చేసింది...తొమ్మిది జట్లు కేటాయించిన రెండేళ్లలోపు ప్రత్యర్థి జట్లని పరస్పర అంగీకారంతో ఎంచుకుని ఆరు టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది...అయితే ఈ గడువు ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లకి 2021, జూన్‌‌లో ఫైనల్ నిర్వహించి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ని నిర్ణయించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

 

భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ షెడ్యూల్ ప్రకారం జూలై 2019న వెస్టిండీస్‌తో తొలి సిరీస్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్ తరహాలోనే 13 జట్లతో వన్డే లీగ్‌ని కూడా ఐసీసీ నిర్వహించనుంది. టెస్టు సభ్యత్యం ఉన్న 12 దేశాలతో పాటు నెదర్లాండ్‌ ఈ వన్డే లీగ్‌లో పోటీపడనుంది. ఈ లీగ్ 2020 మే 1న ప్రారంభమై.. 2022 మార్చి 31న ముగియనుంది. మొత్తం 13 జట్లు.. ప్రత్యర్థిని ఎంచుకుని రెండేళ్లలో ఎనిమిది సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అది ఎవరి సొంతగడ్డపై ఆడాలన్న నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతో జట్లు తీసుకోవచ్చు.

 

ఇదిలాఉంటే గడువు ముగిసేలోపు టాప్-7లో ఉన్న జట్లు భారత్ వేదికగా 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కి నేరుగా అర్హత సాధించనున్నాయి. భారత జట్టు మాత్రం ఆతిథ్య హోదాలో నేరుగా టోర్నీలో ఆడనుంది. ఇక మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయర్స్ ఆడటం ద్వారా ప్రపంచకప్‌‌కి  ఈ వన్డే లీగ్‌ని భారత జట్టు 2020, జూన్‌లో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌తో ఆరంభించనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: