“ధోనీ” కంట “కన్నీరు”..ఆ రోజు ఏం జరిగిందంటే

Bhavannarayana Nch

ఎన్నో ఎదురు దెబ్బలు..మరెన్నో అవమానాలు..జీవితంలో ఎదో సాధించాలి అనే తపన సహకరించే వారు లేకపోవడం..ఇవన్నీ ధోనీ క్రికెట్ ఆట కోసం పడ్డ కష్టాలు..ఒకటి కాదు రెండు కాదు జీవితంలో తాను  ఎదుర్కున్న ఎత్తుపల్లాలు  ధోనీ ని ఒక అత్యన్నతమైన ఆటగాడిగా మలిచాయి..దేశం గర్వించే గొప్ప ఆటగాడిగా మలిచాయి..ఒక్క రోజులో ధోనీ ఒక వెలుగు వెలగలేదు అయితే ధోనీ ఈ క్రమంలో ఏడ్చినా సందర్భాలు లేవు కూడా అన్ని కష్టాలు దిగమింగి భాడాలని అణుచుకుని క్రికెట్ కోసం పరితపించాడు..అయితే ఈ క్రమంలోనే

 

ధోనీ టీం ఇండియా కెప్టెన్ గా భాద్యతలు స్వీకరించిన తరువాత 2011 లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ లో సిక్స్ కొట్టి చాలా కూల్ గా క్రీజ్ లోనుంచీ బయటకి నడుచుకుంటూ వచ్చేశాడు..కోట్లాది మంది గత కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ వరల్డ్ కప్ విజయం అందగానే తీవ్ర భవొద్వెగానిఐ ప్రతీ భారతీయుడు లోనయ్యాడు..ప్రతీ క్రికెటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ధోనీ కంటిలో నుంచీ  చిన్న చుక్క కూడా కారలేదు..చాలా కూల్ గా ఉన్నాడు ఒక కెప్టెన్ గా హుందా తనాన్ని నిలుపుకున్నాడు అయితే తాను ఎదిగిన క్రమమే ఈ రకమైన దృడమైన గుండెని కలిగించి ఉంటుంది అనుకున్నారు అందరూ అయితే

 

 ధోనీ తాజాగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒకటి అభిమానులకి ఆశ్చర్యం కలిగించింది..ఒక్క అభిమానులని మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలు నివ్వెర పోయారు..ధోనీ సన్నిహితులు సైతం ధోనీ కన్నీటికి చలించి పోయారు.. ప్రపంచకప్ ను  సాధించినప్పుడు కూడా ధోని  ఎలాంటి భావోద్వేగానికి గురికాలేదు అలాంటిది 2018.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల నిషేధం ముగిసి మళ్లీ ఐపీఎల్ బరిలోకి వచ్చి కెప్టెన్ గా ధోనీకి మళ్ళీ భాద్యతలు అప్పగించాగానే

 

విలేకరులతో మాట్లాడుతుండగా ధోని కంట్లో కన్నీరు కారింది నిషేధం తర్వాత చైన్నై తరఫున ఆడబోతున్నట్టు తెలియగానే ధోని కంట కన్నీళ్లు అందరిలోనూ ఆశ్చర్యం కలిగించాయి...అయితే ఎంత మానసిక ధృడత్వం ఉన్నాకానీ ఒక రోజు ప్రతీ మనిషికి బ్యాడ్ టైం వస్తుంది . చైన్నై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధం పడ్డప్పుడు ధోని పుణె తరఫున ఆడాడు. మొదటి సీజన్ లో కెప్టెన్ పదవి ఇచ్చారు.. రాణించలేదని కెప్టెన్ పదవి తీసేసి ఆస్ట్రేలియా కెప్టెన్ స్వీవెన్ స్మిత్ కు పగ్గాలిచ్చారు. పుణె జట్టులో ఉన్నప్పుడు యాజమాన్యం ధోని ఆడడం లేదని ఎన్నో అవమానాలు చేసినా భరించాడు. సాక్షాత్తూ టీం యజమాని ధోని పని అయిపోయిందని విమర్శలు కూడా చేసింది.

 

 అయితే ఎప్పుడు ఎటువంటి అవమానాలు కలిగినా తొణకని ధోనీ కి అవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి అయితే అప్పటి పరిస్థితులని సైతం లెక్క చేయకుండా చెన్నై మళ్ళీ ధోనీ ని కెప్టెన్ గా కొనసాగించడంతో ధోనీ చేలించి పోయాడు తాను భారత్ కంటే, తన సొంత రాష్ట్రం జార్ఖండ్ కంటే కూడా ఎక్కువ మ్యాచ్ లు చైన్నై తరఫున ఆడానని  ధోని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు...అందుకే ధోని కి చెన్నై అంటే ఎంతో గౌరవం చెన్నై ప్రజలకి ధోనీ అంటే ఆరాద్య దైవం అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: