చేజారిన “ట్రోఫీ”...“శాఫ్” ఫైనల్స్ లో భారత్ పరాయజం.

Bhavannarayana Nch

భారత ఫుట్బాల్ జట్టు ఆటగాళ్ళు శాఫ్ ఫైనల్స్ లో పరాజయం పొందారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా ఎస్ఏఎఫ్ఎఫ్(సౌత్ ఏషియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) ఫైనల్స్ లో ప్రత్యర్ధి మాల్దీవుల జట్టు చేతిలో ఘోరంగా 2 -1 తేడాతో  ఓడిపోయింది..ఎంతో మంది భారత జట్టు అభిమానులు ఈ మ్యాచ్ వైఫల్యంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..ఫైనల్స్ వరకూ వచ్చిన మ్యాచ్ ని చేజేతులారా పోగొట్టుకోవడం అందరిని

 

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన భారత జట్టు...టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో చిత్తు చేసిన మాల్దీవుల జట్టుతోనే ఇవాళ ఫైనల్లో తలపడింది. కానీ.. ఏ దశలోనూ భారత ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు. భారత ఆటగాళ్లు గోల్‌ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మాల్దీవుల ఆటగాళ్లు కట్టడి చేశారు.. అడుగడుగునా భారత ఆటగాళ్ళని కట్టడి చేసుకుంటూనే వచ్చారు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ళు..

 

ఇదిలాఉంటే మొదటి హాఫ్‌లో హుస్సేన్‌ గోల్‌ చేసి మాల్దీవుల జట్టుకు ఆధిక్యానిచ్చాడు  రెండో హాఫ్‌లో అలీ ఫాసిర్‌ గోల్‌ చేసి ఆధిక్యతను 2-0కి చేర్చాడు. ఆట చివర్లో భారత ఆటగాడు సుమిత్‌ గోల్‌ చేసి మాల్దీవుల ఆధిక్యతను 2-1కి తగ్గించినా మార్దీవుల జట్టు జారుని ఆపలేక పోయింది..దాంతో మ్యాచ్‌ ముగిసేసరికి భారత్‌ మరో గోల్‌ చేయకపోవడంతో  ట్రోఫీనీ వదులుకోవాల్సి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: