“నెం వన్ స్పిన్నర్” అతడే... హర్భజన్ షాకింగ్ కామెంట్స్..!!

NCR

టీమిండియా మాజీ స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ ఎప్పుడు ఎక్కువగా స్పందించాడు అలాంటిది ఎలాంటి విషయంలో అయినా సరే స్పందిచాడు అంటే తప్పకుండా ఆ విషయానికి ఓ గుర్తింపు ఉన్నట్లే లెక్క. అయితే తాజాగా బజ్జీ  టీమిండియా  బౌలర్‌  కుల్దీప్ యాదవ్  పై వెటరన్‌ స్పిన్నర్‌ పై  ప‍్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా ఆశాకిరణం కుల్దీప్‌ అంటూ కొనియాడాడు.

 

అతడికి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉందని తప్పకుండా భవిష్యత్తులో అతను నంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా అవతరిస్తాడనడంలో దానిలో ఎలాంటి సందేహం లేదని భజ్జీ ప్రశించాడు.  “భారత జట్టులో కుల్దీప్‌ యాదవ్‌ ఒక ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు. టీమిండియాలో నంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా అయ్యే సత్తా కుల్దీప్‌లో ఉంది. భవిష్యత్తులో భారత జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించడం ఖాయం.

 

అయితే అతడిలో ఉన్న నైపుణ్యం ఏమిటంటే...బంతిని రెండు వైపులా స్పిన్‌ చేయగలగడమే అతడిలో ఉన్న గొప్ప నైపుణ్యమని బజ్జీ తెలిపాడు..బంతిని గాల్లోనే నెమ్మదిగా స్పిన్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపెట్టడంలో ఇప్పటికే కుల్దీప్‌ తనదైన మార్కును చూపడెతున్నాడు. భవిష్యత్తు అతనిదే. టీమిండియా జట్టులో నంబర్‌ వన్‌గా స్పిన్నర్‌గా కుల్దీప్‌ నిలవడానికి ఎంతో సమయం పట్టదని బజ్జీ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: