ఓజోన్ పొరకు రంధ్రం... ఇక ముప్పు తప్పదా..!

MOHAN BABU
ఓజోన్ పొర మునుపెన్నడూ లేనంతగా దెబ్బతింది. గాల్లో కలుస్తున్న ప్రమాదకర రసాయనాలతో ఓజోన్ పొరకు భారీగా తూట్లు పడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 8 రెట్లు అధిక పరిమాణంలో భారత పరిధిలో ఓజోన్ పొరకు చిల్లు పడినట్లు అమెరికాకు చెందిన నాసా నేషనల్ ఓషియానికాండర్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీతంగా పాడవుతున్న ఓజోన్ పొరను కాపాడుకుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం పెరిగి పోవడం భూమండలానికి పెనుముప్పుగా మారుతుంది.

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం లో ఉత్తరాంధ్ర గోళంలో చలి గాలులు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటికి తోడు గాలిలో కలుస్తున్న ప్రమాదకర రసాయనాల కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా  సేకరించిన వివరాల ప్రకారం ఓజోన్ రంధ్రం పరిమాణం ప్రస్తుతం 2.48కోట్ల చ. కి. మీ స్థాయికి చేరింది. అంటార్కిటికా ప్రాంతంలో విపరీతంగా తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు, గాలులు దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు సూత్రికరిస్తున్నారు. ప్రతిఏటా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దక్షిణార్థ గోళంలో అంటార్కిటికా మీదుగా ఓజోన్ రంధ్రం విస్తరిస్తోంది. సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్య నాటికి అది గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలోనే మనుషులు వివిధ సాధనాల ద్వారా  విడిచిపెట్టే క్లోరిన్, బ్రోమైన్ సంబంధిత రసాయనాలు బాగా ఎత్తులో ఉండే ధ్రువ మేఘాల్లో కి వెళ్లి వాటితో చర్యలు జరుగుతాయి. అవి ఓజోన్ రంధ్రాన్ని మరింతగా పెంచుతాయి. దాని పరిమాణాన్ని శాస్త్రవేత్తలు ఏటా కొలుస్తూ నమోదు చేస్తుంటారు. సాధారణంగా ఓజోన్ రంధ్రం భారీ పరిమాణంలో కొంతకాలమే ఉంటుంది. వేసవి వచ్చే కొద్దీ రంధ్రం క్రమంగా పూడ్చుకుపోతూ సాధారణ స్థాయికి చేరుతుంది. ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఆనందం ఒకే స్థాయిలో ఉండడం లేదా మరింత పెరిగినట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు నమోదైన సగటు ఓజోన్ రంధ్రం స్థాయి కంటే ప్రస్తుత పరిమాణం చాలా పెద్దది గా ఉన్నట్లు వారు చెబుతున్నారు. వాతావరణంలోకి సిఎఫ్ సి లెవన్ వాయువు విడుదల వల్లే ఓజోన్ పొరకు భారీస్థాయిలో చిల్లు పడుతుంది. సిఎఫ్ సి లెవన్ నుంచి వెలువడే వేడి ప్రతి సంవత్సరం 16 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు వెలువరించే బొగ్గు పులుసు వాయువుతో సమానమని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: