కార్ల వెనక అద్దంపై గీతలు ఎందుకుంటాయో తెలుసా?

ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మారిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది.ఇంకా ఈరోజుల్లో టెక్నాలజీ అనేది చాలా స్పీడ్ గా పెరుగుతోంది. టెక్నాలజీ ఎంతలా పెరిగింది అంటే నూనె దీపం నుంచి ట్యూబ్ లైట్ వరకూ, టెలిఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకూ కూడా ఇలా అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మార్పులు వల్ల ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది.ఇంకా అలాగే ఎంతో కష్టతరమైన పనులు సైతం మిషన్లతో చాలా సులువుగా అయిపోతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉపయోగకరమైనటువంటి చిన్న చిన్న అంశాలని కూడా మనం గమనించకుండా వాటిని వదిలేస్తూ ఉంటాం.నిజానికి దాన్లో చాలా పెద్ద గొప్ప విషయం ఉంటుంది. ఇక ఈరోజుల్లో కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది కూడా కార్లు కొనుక్కుంటూ షికార్లు చేస్తున్నారు.ఇప్పుడు అయితే మాత్రం కార్ విండోస్ పైన ఉపయోగించిన టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుదాం. కారు విండోస్ పై వైపర్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి.


వర్షం పడే సమయంలో అవి ముందుకు ప్రయాణించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక దాని తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే విండ్ షీల్డ్ లైన్స్. ఈ సన్నుని లైన్స్ ని కారు వెనుక విండోస్ మీద చాలామంది కూడా గమనించే ఉంటారు. కానీ దాని గురించి అయితే పెద్దగా పట్టించుకోరు.నిజానికి దీని వెనుక చాలా పెద్ద విషయమే దాగి ఉంది. ఇక విండోస్ మీద ఉండే ఈ లైన్స్ ని Defoggers అని అంటారు. ఇవి ఒక ఎలక్ట్రికల్ లైన్స్. వీటిగుండా కరెంటు అనేది ప్రవహిస్తుంది. దానివలన గ్లాస్ అనేది వేడెక్కుతుంది. విండో మీద చేరిన తేమ మంచు ఆ వేడి వల్ల తొలగిపోయి ఒక స్పష్టమైన వ్యూ మీకు కనిపిస్తుంది.ఇక ఈ చిన్న విషయం చూసే వాళ్ళకి పెద్ద టెక్నాలజీగా అనిపించకపోవచ్చు. కానీ ప్రయాణికుల భద్రత సౌకర్యానికి ఈ టెక్నాలజీ ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ సారి లాంగ్ డ్రైవ్ వి వెళ్లినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని ఒక సారి గమనించండి. మీకే స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: