బుల్లి పిట్ట: ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిన నోకియా కొత్త మొబైల్..!!

frame బుల్లి పిట్ట: ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిన నోకియా కొత్త మొబైల్..!!

Divya
నోకియా మొబైల్ యొక్క లేటెస్ట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలకే లభిస్తోంది. నోకియా నుంచి C-12 మొబైల్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఈ నోకియా బడ్జెట్ మొబైల్ కస్టమర్లను ఆకర్షణీయమైన డిజైన్తో మరియు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా బెస్ట్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్లో రూ.6000 బడ్జెట్ మొబైల్ గా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది విడుదల చేసినట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం

NOKIA -C12:
నోకియా C-12 మొబైల్ 2 GB ram +64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ మొబైల్ లాంచ్ అవ్వడం జరిగింది ఈ మొబైల్ ఈరోజు నుంచి సేల్స్ లోకి అందుబాటులోకి వస్తోంది. ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..6.3 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలిగి ఉంటుంది అలాగే డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుందట. ఇక ఇందులో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. UNISOC sc 9863A ఆక్టో కోర్ ప్రాసెస్ ఈ మొబైల్ వర్క్ అవుతుంది.

2GB రామ్ కి జతగా 2GB వర్చువల్ రామ్ తో పాటు 64 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా కూడా ఈ మొబైల్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.NOKIA C-12 మొబైల్ కెమెరా బ్యాక్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా  కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 3000 MAH సామర్థ్యం తో కలదు. ఇక ఇతర ఫీచర్ల పరంగా కూడా ఈ మొబైల్ చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కేవలం 4G VOLTE మొబైల్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వైఫై బ్లూటూత్ తదితర ఫీచర్లు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: