బుల్లితెర‌: పాపం.. పండ‌గ పూట ఏడ్చేసిన రోజా.. ఎందుకో తెలుసా..?

Kavya Nekkanti

 వైసీపీ అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యేగా కొనసాగిన రోజా.. జబర్దస్త్ కార్యక్రమాన్ని సాఫీగానే చేసుకున్నారు. అయితే.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెపై బాధ్యత పెరిగినట్లైంది. అయితే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అటు టీవీ షోలు.. ఇటు రాజకీయాలు.. రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ, పర్సనల్ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు రోజా. ఇదిలా ఉంటే.. సంక్రాంతి సందర్భంగా ఈటీవీలో మల్లెమాల వారు అమ్మ నాన్న ఓ సంక్రాంతి అనే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ల పిల్లలతో కలసి కామెడీ ట్రీట్ ఇస్తున్నారు.

 

మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వచ్చే కార్యక్రమాలన్నింటిలో పని చేసే ఆర్టిస్టులందర్నీ ఒక వేదికపైకి తెచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ సారి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రోజా...తొలి ప్రోమోలో ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అంటూ హడావిడి చేయడంతో ప్రత్యేక కార్యక్రమం మొదలైంది. దీనికి సంబంధించిన మ‌రో ప్రోమోలను కూడా విడుదల చేసింది. అయితే ఓ ప్రోమోలో నిజంగానే రోజా ఏడ్చేశారు. కార్యక్రమంలో భాగంగా రోజా కుమారుడు కృష్ణ లోహిత్ ఒక పాట పాడాడు. దానికి ఉబ్బితబ్బిబ్బైన రోజా.. స్టేజీపైనే తన కుమారుడిని ముద్దాడి పొంగిపోయింది. 

 

అలాగే ఈ ప్రోగ్రామ్ ఆమె మాట్లాడుతూ.. షూటింగ్స్‌కు, పాలిటిక్స్ అని బయటికి వెళ్లినపుడు బాగా అర్థం చేసుకుంటున్నారని భోరున ఏడ్చేశారు. కష్టపడేదంతా వాళ్ల కోసమేనని, డబ్బు అవసరం లేదు.. అమ్మా! మీరు మాత్రమే కావాలి.. అని అంటారని ఆనంద భాష్పాలు రాల్చారు. అయితే షోలో భాగమే అయినా... ఆమె నిజంగానే ఏడ్చేసారు. వాస్త‌వానికి రోజాకు మాత్రం ఓ వెలితి అలాగే ఉండిపోయినట్లుంది. అదే.. పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం కావచ్చు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నానని అనుకుందో ఏమో కానీ వేదికపైనే ముంచుకొచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక రోజా బోరున విలపించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: