బుల్లితెర: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వంటలక్క ఫోటోలు..!
తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో అత్యధిక జనాదరణతో దూసుకెళ్తున్న కార్తీక దీపం క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే కార్తీక దీపం సీరియల్ ఒక కీలక దశకు వచ్చేసింది. మరోవైపు పలు టీవీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్‌కు వచ్చే రేటింగ్స్ లో సగం మాత్రమే తెచ్చుకొని సంతృప్తి చెందుతుంటే, ఇప్పుడు ఏకంగా అగ్రహీరోల సినిమాలను సైతం తోసి రాజని నెంబర్ వన్ స్థాయిలో నిలిచింది కార్తీక దీపం. అలాగే ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్) క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
క్లారిటీగా చెప్పాలంటే ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఈమె కారణం కూడా. వంటలక్క అలియాస్ దీపగా తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాళంలోనూ అంతే ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీపక్క అని కొందరు, వంటలక్క అని కొందరు సంబోధిస్తూ ఉంటారు. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో కుడా ఫుల్ యాక్టివ్ ఉంటుంది ఈమె. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోయర్లతో పంచుకుంటోంది. ఆమె నుంచీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలు మహిళలు, పురుషులు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. తాజాగా ప్రేమి విశ్వనాథ్ కేరళలోని త్రిచూర్‌లో షాప్ ఇయా మొహందీ నైట్ అనే ఈవెంట్‌కు హజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్లో తీసని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే పింక్ డ్రెస్‌లో ఆమెను చూసి ఫ్యాన్స్... వంటలక్క అదుర్స్, సూపర్, క్వీన్, గార్జియస్ అంటూ... రకరకాలుగా మెచ్చేసుకుంటున్నారు. హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా అంటూ సలహాలు కూడా ఇస్తుండటం విశేషం. కాగా, ఇప్పటికే సినీ తారల్ని మించి... ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది ఈ వంటక్క. అటు మలయాళ ప్రేక్షకులు, ఇటు తెలుగు ప్రేక్షకులూ అందరూ వంటలక్కను తమ ఇంట్లో సొంత అక్కలా ఫీలవుతున్నారు.