బుల్లితెర: 'షూటింగ్'లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్లు!

Durga Writes

ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి.. ఈ కరోనా వైరస్ ని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేశారు కదా.. ఇంకా అలాంటి లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.. ఎవరు బయటకు వెళ్ళేకి లేదు.. ఇంకా అలానే షూటింగ్స్ మొత్తం ఆపేశారు. ఎక్కడ ఎవరు సినిమా షూటింగ్ లు, సీరియల్ షూటింగ్ లు చేసేకి అనుమతిలేదు . దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. 

అయితే ఇప్పుడు లాక్ డౌన్ లేకపోవడం వల్ల మొత్తం షాపులు అన్ని తెరుచుకున్నాయి. ఇంకా అలానే షూటింగ్స్ కి కూడా అనుమతి వచ్చింది. దీంతో అందరూ ఆనందంగా షూటింగ్ కి వచ్చి ఆ ఫోటోలను, వీడియోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇంకా అంతేకాదు కొన్ని షోస్ లో కొంతమంది యాంకర్స్ ని తీసేసినట్టు వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు. 

ఇంకా అలా చెక్ పెట్టిన యాంకర్ లో అనసూయ ఒకరు.. ఆమెను జబర్దస్త్ లో తొలిగించినట్టు ఆమె ప్లేస్ లో కొత్తవారిని తీసుకువచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే అదేం లేదు అని ఆమె తేల్చేసింది. ఇంకా అదిరింది షో కి సంబంధించి భాను శ్రీ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు షేర్ చెయ్యగా అనసూయ ఆనందంతో పోస్ట్ ఏ పెట్టేసింది. 

ఇంకా సీనియర్ యాంకర్ సుమ అయితే చాల రోజుల తర్వాత సెట్స్ కి వచ్చినట్టు.. శానిటైజర్, మాస్కులు అన్ని ఉపయోగిస్తున్నట్టు.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి మీరు ఓ సారి చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: