తెలుగు సీరియల్ షూటింగ్ చూడటానికి వచ్చిన కరోనా...ఎంతమందికొచ్చిందంటే..?

Suma Kallamadi

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల కలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరి దగ్గర నుంచి వస్తుందో ఎటు నుంచి వస్తుందో తెలియడం లేదు. ఒక పక్క కరోనా నియంత్రణకై ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. కరోనా ప్రభావం అన్ని రంగాల మీద పడింది. అయితే తెలుగు సీరియల్స్ కూడా చాలా రోజులు షూటింగ్స్ జరుపుకోలేదు. మొత్తానికి కొన్ని ఆంక్షలతో కొద్దీ మంది మాత్రమే షూటింగ్స్ లో పాల్గొనాలని సూచిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక అదే పనిగా వరుసగా సీరియల్ షూటింగ్ లు షురూ చేసేశారు. ఇంకేముంది కరోనా విపరీతంగా పెరిగిపోయింది.

 

 

 కరోనా సీరియల్స్ లో నటించే నటులను వెంటాడుతోంది. లాక్ డౌన్ అనంతరం సీరియల్ షూటింగ్స్ ప్రారంభం కావటంతో చిన్న నటులు తెగ బిజీ అయిపోయారు. అయితే కరోనా కట్టడికి నామమాత్రంగా జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. షూటింగ్ సమయంలో చిన్నపాటి జాగ్రత్త కూడా కరోనా వ్యాప్తికి కారణంగా మారుతోంది.  ఇందులో కొందరు ముఖ్య యాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలటంతో మరింత ఆందోళన మొదలైంది. 

 


 

ఒక్కరొక్కరుగా కొవిడ్ -19 బరిన పడటంతో ఇప్పుడు బుల్లి తెర ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియక చివరికి మరోసారి ప్యాకప్ చెప్పాలనే ఆలోచనల్లో ఉన్నాట్లు తెలుస్తోంది.దీంతో బుల్లితెర నటుల్లో భయం పట్టుకుంది. ఇప్పటివరకూ షూటింగ్ లలో పాల్గొన్న వాళ్లంతా  తమకి కరోనా వస్తుందేమో అని వనికిపోతున్నారు. ఇదంతా చూస్తున్న సినిమా పరిశ్రమలోనూ గుబులు మొదలైంది. అతి తక్కువ మందితో షూటింగ్ మొదలు పెట్టినా ఎక్కడి నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందో తెలియక పోవటంతో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. మళ్ళీ పూర్తి స్థాయిలో షూటింగ్ లను రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు బుల్లితెర వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: