బుల్లితెర: అనసూయ కోసం కష్టపడిపోతున్న భరద్వాజ్.. అంత కష్టం ఏమిటంటే?
అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై స్టార్ యాంకర్, నటి అనసూయ ఇప్పుడు షూటింగ్ లో బాగా బిజీ అయ్యారు. కరోనా వైరస్ లోక్ డౌన్ కారణంగా ఏకంగా వంద రోజులకు పైగా ఈ షూటింగ్ లు లేకుండా ఇంట్లోనే ఉన్న అనసూయ ఇప్పుడు షూటింగ్లకు అనుమతి లభించడంతో ఫుల్ బిజీగా అయ్యింది.
ముఖానికి మేకప్ వేసుకొని.. కెమెరా ముందుకు వస్తున్న అనుసయకు.. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో భయపడుతూనే షూటింగ్స్ లో పాల్గొంటున్నారట. అయితే ఆ భయం వద్దు అని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ సెట్స్ వద్దకు వచ్చి ధైర్యం చెబుతున్నారట. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారట.
ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. అనసూయనే ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించారు. భర్తతో సెట్స్ లో తీసుకున్న సెల్ఫీలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఇది అంత చెప్పుకొచ్చారు. ఇంట్లో వాళ్ళ అమ్మ వండినా భోజనాన్ని షూటింగ్ వద్దకు తీసుకువచ్చి, తనతో కలిసి భోజనం చేసినట్టు ఆమె పోస్ట్ లో చెప్పారు.
అంతేకాదు.. కరోనా వేళా పని చేయడానికి భయపడుతున్న సమయంలో తన భర్త ఇలా వచ్చి తనకు దైర్యం చెప్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నట్టు ఆమె వెల్లడించారు. ఇంకా ఈ షూటింగ్ లో తీసుకున్న సెల్ఫీలు తనకు ఎప్పుడు గుర్తుండిపోతాయని అంటున్నారు. అయితే ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు కొందరు క్యూట్ కపుల్ అంటే మరికొందరు మీ లుక్ ఎం బాగోలేదు అనసూయ గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఓ సారి చూసేయండి.
auto 12px; width: 50px;">View this post on InstagramWhen hubby dearest drops in at my shoot bringing fresh {{RelevantDataTitle}}