‘ఆమె కథ’.. హడలెత్తిస్తున్న రాణీ ? మహేశ్వరిని కాపాడేదెవరు ? మరీ గౌతమ్ !

Suma Kallamadi

అతి తక్కువ కాలంలో ప్రేక్షకుల మది గెల్చుకున్న సీరియల్ ఆమె కథ. ఈ సీరియల్ 118 ఎపిసోడ్స్ కంప్లిట్ చేసుకుంది. ఆ ఎపిసోడ్ లోని హైలెట్స్ ఇవే. రాణీలోకి సుహాసిని ఆత్మ ప్రవేశించడంతో... రాజకోట రహస్యాలన్నీ తెలిసిన విమలా దేవిని బెదిరించి.. జడ్జ్ ముందు నిజాలు చెప్పాలనే ఒప్పించి.. జడ్జ్ ముందుకు తీసుకుని వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్లాక.. రాణీలో ఉన్నది రాణీ కాదు సుహాసినీ అని గుర్తించిన విమలాదేవి... ‘అమ్మో ఇప్పుడు నేను నిజాలు చెబితే అక్కడ రాజమాత, ఇక్కడ రాణీ ఇద్దరూ చంపేస్తారు..’ అనుకుని దొంగచాటుగా రాజమాతకు కాల్ చేసి చెప్పడంతో.. రాజమాత జడ్జ్ ఇంటికి వచ్చేస్తుంది.

 

 

సరిగ్గా అప్పటికే చాలా నిజాలు రాణీ జడ్జ్ ముందు కూర్చుని చెబుతుంది. అయితే రాణీ సుహాసినిలా మాట్లాడుతూ.. ‘నన్ను ఆ రాజమాత వాళ్లే చంపేశారు’ అనడంతో జడ్జ్‌కి ఏం అర్థం కాదు. ‘మీరు ఏం మాట్లాడుతున్నారు.. మీరు బతికే ఉన్నారుగా.. మీరు రాణీ పద్మినీ దేవి కదా..?’ అంటాడు అయోమయంగా.

 

 

సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రాజమాత... కోపంగా... ‘రాణీ చెప్పేవన్నీ అబద్దాలు జడ్జ్ గారు.. తను ఈ మధ్యే మెట్ల మీద నుంచి జారి పడింది. అప్పటి నుంచి ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతోంది..’ అంటూ రాణీ మరో మాట మాట్లాడకుండా తన వెంట తెచ్చిన పవిత్రగంగాజలం జల్లడంతో రాణీ కళ్లు తిరిగి పడిపోతుంది. విమలా రాజమాతలు కలిసి రాణీని కోటకు తీసుకుని వెళ్లిపోతారు.

 

 

రాజకోటలో రహ్యగది ఓపెన్ చేసి ఉండటం.. అందులోంచి రాణీ దెయ్యం పట్టినదానిలా జుట్టు విరబోసుకుని రావడం చూసి షాక్ అవుతారు రాజమాత, విమలాదేవులు. దాంతో రాజమాతకు కాస్త బోధపడుతుంది. వెంటనే రాజగురువుతో ఉండే శిష్యుడ్ని పిలిపిస్తుంది. అతడు విషయం ఏంటని అడగడంతో... పైన ఓ చోట కూర్చుని.. ఆవేశంతో ఊగిపోతున్న రాణీని చూపించి.. ‘ఏదైతే జరగొద్దని భయపడ్డామో ఇప్పుడు అదే జరిగింది’ అంటుంది కంగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: