ఆ వార్తలో నిజం లేదు ? : యాంకర్ అనసూయ

Suma Kallamadi

తెలుగు టెలివిజన్ తెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో అందరికి సుపరిచితురాలైన యాంకర్ అనసూయ భరద్వాజ్ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. యాంకరింగ్ తర్వాత నటనలో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మంచి గుర్తింపును దక్కించుకున్నారు.  విలక్షణమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు అనసూయ.

 

 

తాజాగా ఆమె గురించి ఓ వార్త హల్ చల్ అవుతోంది. హీరో సుమంత్ అశ్విన్ కు తల్లి పాత్రలో అనసూయ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితా ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా టీవీ షూటింగులకు వెళ్లడం కుదరట్లేదని, ఇక సినిమా ఛాన్స్ ఎక్కడంటూ, ఇందంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపడేసింది. సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అశ్విన్ తల్లిదండ్రులుగా ఇంద్రజ, శ్రీకాంత్ లను తీసుకున్నారు. చెన్నైలో ఉంటున్న ఇంద్రజ కరోనా కారణంగా హైదరాబాద్ షూటింగ్ కు రాలేనని చెప్పింది. దీంతో ఆమె స్థానంలో అనసూయను తీసుకుంటున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 


రంగస్థలం సినిమాతో తన నటనతో అందరిని కట్టిపడేసిన అనసూయను చూసి ఫిదా అయిన క్రిష్ణ వంశీ తను దర్శకత్వం వహిస్తున్న రీమేక్ మూవీ రంగ మార్తండలో ఛాన్స్ ఇచ్చారని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. దీని ఒరిజినల్ మూవీలో నానా పాటేకర్ పాత్రలో టాలీవుడ్ లో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రకు తీసుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో అనసూయ దేవాదాసి పాత్రలో గుడిలో దేవుడి ఉత్సవాల్లో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే పాత్రలో నటించబోతున్నారు. దేవదాసి పాత్రలో ప్రేక్షకులను ఏలా మెప్పిస్తారోనని పలు ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: