రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్..!

Suma Kallamadi
బుల్లితెరపై తనదైన శైలిలో మెప్పిస్తూ షోలు చేస్తున్నయాంకర్ సుమ. ఇటీవల కాలంలో సుమ ఆడపడుచు శ్రీలక్ష్మి మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. రాజీవ్, శ్రీలక్ష్మి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ్సరం లేదు. వారిద్దరూ రాఖీ పండుగకు ప్రతీకగా చాల ఇంటర్వూస్ కూడా ఇచ్చారు. అయితే రాజీవ్ కనకాల రాఖీ పండుగా సందర్బంగా తన చెల్లిని గుర్తు చేసుకున్నారు. ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ సినీ నటుడు రాజీవ్‌ కనకాల భావోద్వేగానికి గురైయ్యారు.

అయితే రాజీవ్ చెల్లెలు శ్రీలక్ష్మీ కనకాల(40) చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌తో ఈ లాక్ డౌన్ సమయంలోనే కన్నుమూశారు. ఆ సమయంలో లాక్ డౌన్ నిబంధనలు కారణంగా రాజీవ్ కనకాల ఇంటికి ఎవ్వరూ రావ్వద్దని.. రాజీవ్ స్నేహితుడు నటుడు హర్ష వర్థన్ ప్రకటించారు. సినీపరిశ్రమకు సంబంధించిన పలువురు అంతా సామాజిక మాధ్యమాల సాయంతోనే సానుభూతి తెలిపారు. అయితే నిన్ను(ఆగస్ట్ 3) రాఖీపౌర్ణమి కావడంతో.. తన చెల్లెలు శ్రీలక్ష్మిని తలుచుకుంటూ రాజీవ్ కనకాల ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో ఇలా తన బాధని అభిమానులతో పంచుకున్నారు.

రాజీవ్ ఆ పోస్టులో తన సోదరి తనపై చూపించే అనురాగానికి విలువ కట్టలేనన్నారు. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడుతుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదని తెలిపారు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను.’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ని అభిమానులతో పంచుకున్నారు రాజీవ్ కనకాల. దీంతో పలువురు నెటిజన్లు.. ‘మీ చెల్లి ఏ లోకంలో ఉన్న మిమ్మల్నీ చూస్తూనే ఉంటుంది. ఆ బాధ మాటల్లో చెప్పలేం. తోబుట్టువులు అంటే క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవ్వరుంటారు?’ అంటూ అభిమానులు వారి నిర్ణయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: