బిగ్ బాస్ 4 ఈసారి సక్సెస్ అవుతుందా?
బిగ్ బాస్... బుల్లితెరపై ప్రసారం అవుతూ మునుపెన్నడూ లేని విధంగా ఓ రేంజ్ లో ప్రజాదరణ పొంది, భారీ సంఖ్యలో అభిమానులను తన అకౌంట్ లో వేసుకున్న ఓ మెగా రియాల్టీ షో. సీజన్ 1,2 3 లు విజయవంతంగా పూర్తి కాగా బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పుడు వస్తుందా..! అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే కరోనా కారణంగా సీజన్ 4 ఉండదనే వార్తలు వారి ఆశలను చిదిమేసాయి. ఇంతలోనే మన నాగ్ సోషల్ మీడియా లో ఓ పిక్ పోస్ట్ చేశారు,ఆ పోస్ట్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 4 రెడీ అంటూ ప్రభంజనం సృష్టించారు. ఈ సీజన్ 4 కు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. షో ని ముందుకు నడపడానికి ఎంతో పకడ్బందీగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారట.
ఇక అప్పటినుండి సీజన్ 4 లో కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు మంగ్లీ, యాంకర్ రవి, రఘు మాస్టర్ దంపతులు, యూట్యూబ్ స్టార్ మహాతల్లి, సింగర్ నోయల్, ప్రముఖ నటి హంస నందిని, ప్రియా వడ్లమాని, అరుణ అదిత్, యూట్యూబ్ ద్వారా మనకు సుపరిచితులైన మెహబూబా దిల్ సే.... అయితే ఇంతకు ముందులా బిగ్ బాస్ షోలో హగ్ లు, మసాలా సీన్లు ఉండవట కారణం కరోనానే.
కంటెస్టెంట్ లకు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా జారీ చేసింది యాజమాన్యం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే యాక్టివిటీస్ చేసేలా షో డిజైన్ చేశారట. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతకుమించి అనిపించేలా మన ముందుకు రాబోతోంది బిగ్ బాస్ సీజన్ 4. అసలే హాట్ గ్లామరస్ కంటెస్టెంట్ లు ఎక్కువగా ఉన్న ఈ సీజన్లో కరోనా రూల్స్ పాటిస్తారో లేక దాటేస్తారో చూడాల్సిందే. ఇక నాగార్జున గారి హోస్ట్ విషయానికొస్తే ఇంతకు ముందులా కంటెస్టెంట్స్ తప్పులు చేస్తే కూల్ గా ఉండరట ప్రేక్షకుల ఆకాంక్ష మేరకు ఈసారి తనలోని వైలెంట్ యాంగిల్ ను బయటకు తీస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కరోనా గొడవ తో విసుగెత్తిన ప్రజలకు ప్రతిరోజు ఆనందాన్ని పంచేందుకు వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ 4.