కరోనాను జయించిన 92 ఏళ్ల డయాబెటిక్ వృద్ధురాలు, 74 ఏళ్ల వృద్ధుడు.....
గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఎడ్లపల్లి రామానుజమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 6న బామ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గుంటూరులోని శ్రావణి ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ పోసాని శ్రీనివాసరావు శ్రద్ధ తీసుకుని వైద్యం చేశారు. దీంతో రామానుజమ్మ వారంరోజుల్లోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లారు. ఈ నెల 12న బామ్మ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకుంది. 92 ఏళ్ల బామ్మకు డయాబెటిస్ సమస్య కూడా ఉంది. అయినప్పటికీ ఆమె కేవలం వారం రోజుల వ్యవధిలోనే కోలుకోవడం ఆస్పత్రి వర్గాలను కూడా ఆశ్చర్యపడేలా చేసింది. ప్రస్తుతం బామ్మ రామానుజమ్మ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ పోసాని శ్రీనివాసరావు చెప్పారు. కరోనాను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని అలాగని కరోనా వచ్చిందని బయపడాల్సిన అవసరంలేదని డాక్టర్ పోసాని చెప్పారు.