అందరిని ఆకట్టుకున్న మన అంబేడ్కర్ సీరియల్ సాంగ్..!

Suma Kallamadi
బుల్లితెరపై తనదైన రేటింగ్ తో దూసుకుపోతున్న ఛానెల్ జీ తెలుగు. ఈ ఛానల్ లో వచ్చే సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఛానల్ స్పెషల్ ఈవెంట్స్ ని నిర్వహిస్తూ రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. ఈ ఛానల్ లో యదార్ధ జీవితాలను ఆధారంగా చేసుకొని సీరియల్స్ ని చిత్రీకరిస్తున్నారు. జయలలిత జీవితం ఆధారంగా క్వీన్ సీరియల్ ని రూపొందించారు. ఈ సీరియల్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

తాజాగా తెలుగు ప్రేక్షకుల కోసం జీ తెలుగు ఛానెల్ సరికొత్త సీరియల్‌ను తీసుకువస్తుంది. భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మన అంబేద్కర్’ పేరుతో డైలీ సీరియల్‌ను అందిస్తోంది. సమాజంలో అంటరానివాడిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న అంబేద్కర్. రాజ్యాంగ రూపకర్త ఎలా అయ్యారు. ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? తదితర అంశాలను ఈ సీరియల్‌లో చూపించనున్నారు. ఫిక్షన్ డ్రామా‌గా రూపొందుతున్న ఈ సీరియల్ ఆనాటి పరిస్థితులను అద్దం పడుతుందని అంటున్నారు.



తాజాగా ఈ సీరియల్‌కి సంబంధించి. టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘మహా నాయకుడులే భీమ్ రావ్’ అంటూ సాగిన ఈ పాటను నిషాంత్ రాజా కంపోజ్ చేయగా.. వందేమాతరం శ్రీనివాస్ అద్భుతంగా ఆలపించారు. సాగర్ లిరిక్స్ అందించారు. విజువలైజేషన్ కూడా నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టింది. దళితుల్ని ఎంత దారుణంగా చూసేవారో.. అంటరాని వారికి వెలి వేసేవారో చూపించారు.

ఇక బాబా సాహెబ్ అంబేద్కర్ చిన్నతనం బావి దగ్గరకు వెళ్తుండగా అడ్డుకోవడం. దూరం నుంచి గొట్టంతో నీళ్లు పోయడం. పాఠశాల నుంచి బయటకు నెట్టేయడం లాంటివి చూపించారు. భీమ్ రావ్ నాయకుడిగా ఎలా ఎదిగారు. ప్రజల జీవితాల్లో ఎలా వెలుగులు నింపారు లాంటి కళ్లకు కట్టారు. జై భీమ్ జై భీమ్ అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలోపన అద్భుతం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: