బిగ్ బాస్ సీజన్ 4 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ...!!! హాట్ బ్యూటీ ఎవరో తెలుసా....???

VAMSI
బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షో... బుల్లితెరపై ప్రసారం అవుతూ వెండితెరను తలపించే సెలబ్రిటీలతో ప్రతిరోజు మన ఇంట్లో సందడి చేసే ఒక గొప్ప కార్యక్రమం... బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 లు ఎంతటి ప్రేక్షకాదరణ పొందాయో అందరికీ తెలిసిందే... అయితే దీనికి ప్రధాన కారణం ఎక్కువ మంది పెద్ద సెలబ్రిటీలను కంటెస్టెంట్స్ గా ఎన్నుకోవడం ముఖ్య కారణమని చెప్పాలి....


తర్వాత వారి వారి వ్యక్తిత్వాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరై మనసు దోచుకున్నారు... కాగా ఇప్పుడు వచ్చిన సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్స్ కి పెద్దగా స్టార్ డమ్ లేకపోవడంతో ఈ సారి కాస్త ఆసక్తి తగ్గిందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ కూడా వారి జోరు పెంచి హౌస్ లో సందడి చేస్తూ మెల్ల మెల్లగా ప్రేక్షకుల మెప్పును పొందుతున్నారు... అయితే సీజన్ ఫోర్ లో షోను చూసే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెంచేందుకు ఓ హాట్ బ్యూటీని వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ లోకి పంపేందుకు మా టీవీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది...


అయితే ఈ సెలబ్రిటీ ఎవరు..??? అన్న విషయం పై పలు  హీరోయిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో  జంపు జిలాని సినిమాలో నటించిన స్వాతి దీక్షిత్ తో పాటు మరికొందరి హీరోయిన్ల పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంటర్ అవుతాడు అన్న వార్తలు వస్తున్నాయి.... ఇప్పటికే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సెలబ్రిటీస్ క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం... మరి అది ఎవరు ఏంటి అన్నది త్వరలో తెలియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: