నాగభైరవీ.. గ్రాఫిక్స్ తో పాటు రమ్యకృష్ణ నటన అదిపోయిందిగా !
సినిమాలో నటించే రమ్యకృష్ణ ప్రస్తుతం బుల్లితెరపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తెలుగు బుల్లితెరపై నాగమ్మ సీరియల్ కు ఎంతో క్రేజ్. హిందీలో వచ్చే నాగిని సీరియల్ కూడా తన ఎపిసోడ్లను పెంచుకుంటూ వస్తున్నాయి. నాగదేవత, నాగవంశం, శివుడు లాంటి కాన్సెప్ట్ లు బుల్లితెరపై ఎంతగానో అలరించాయి. అత్యాధునిక గ్రాఫిక్ తో, ఉత్కంఠతను నెలకొల్పే సన్నివేశాలతో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తాయి. అందుకే జీ తెలుగు కూడా నాగ సంపద అనే కాన్సెప్ట్ తో నాగ భైరవీ అనే సీరియల్ ను ప్రారంభించబోతుంది.
తాజాగా నాగభైరవీ సీరియల్ కు సంబంధించి లేటేస్ట్ ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది. ఈ ప్రోమో అత్యాధునిక టెక్నాలజీని జోడించారు. అద్భుతమైన గ్రాఫికల్ డిజైన్లు అందించారు. ప్రోమోను చూస్తున్నంత సేపు ఏదో మాయాలోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ పాత్ర మెయిన్ క్యారెక్టర్ గా కనిపిస్తోంది. తరతరాలుగా వస్తున్న నాగ సంపదను రమ్యకృష్ణ వంశం కాపాడుతుంటూ వస్తోందని అర్థమవుతోంది.
రమ్యకృష్ణ తర్వాత ఆ వంశీకురాలు భైరవీ నాగసంపదను కాపాడుతుందా అనే కాన్సెప్ట్ లో నాగభైరవీ సీరియల్ కొనసాగుతుంది. ఇందులో భైరవీకి అండగా నాగార్జున అనే వ్యక్తి ఉంటాడని అర్థమవుతోంది. ప్రోమోనే రమ్యకృష్ణకు నాగ సర్పానికి జరిగిన సంభాషణ, గ్రాఫిక్ డిజైన్, కంకంణం నాగుపాములా మారడం.. మనుషుల వేషంలో నాగులు ఇలా ఎన్నో థ్రిల్లింగ్ కథాంశంలో నాగభైరవీ ముందుకు రానుంది. భైరవీ నాగసంపదను కాపాడుతుందా లేదా తనకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఫేస్ చేస్తుందో సీరియల్ చూశాకే అర్థం చేసుకోవచ్చు.