దొరబాబు గతాన్ని కూడా వదిలపెట్టని హైపర్ ఆది..!

Suma Kallamadi
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్న షో జబర్దస్త్. ఈ షో ద్వారా చాల మంది కామిడీయన్స్ మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒక్కరు. ఆయన కామిడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న విషయాలపై ఇప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటాడు. ఇక గతంలో దొరబాబు అంతకు ముందు బీ గ్రేడ్ సినిమాల్లో నటించడంపై నిత్యం ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు ఆది. దానికి తోడూ దొరబాబు, పరదేశీలు వ్యభిచార గృహంలో పట్టుబడటం, మీడియాలో అది సెన్సేషన్ కావడంతో మరింత ఫేమస్ అయ్యారు.

ఇక దొరికితే వదలరు అంటూ.. 2020లో విపత్తులు మొదలైందే వీరిద్దరితో, వీళ్లు దొరికితే వదిలించడానికి నానా.. అంటూ గ్యాప్ ఇచ్చారు. అయితే పొరబాటున ఐమాక్స్ అనుకుని వెళితే అక్కడ వర్మ క్లైమాక్స్ ఉందని కౌంటర్ వేశాడు. మరో స్కిట్‌లో ఇది స్వయం వరమేనా? దొరబాబు వచ్చాడు కదా వేరే కార్యక్రమం అనుకున్నానని పంచ్ వేస్తున్నాడు. 103 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతోందని దొరబాబు అంటే.. పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చిన తరువాత కూడానా అని ఆది సెటైర్స్ వేశారు.



అంతేకాకుండా వచ్చేవారం రాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదలు చేశారు. అందులో దొరబాబుపై వేసిన సెటైర్స్ బాగా పేలాయి. స్కిట్‌లో భాగంగా దొరబాబు సాంబార్ వండాడు. దాని టేస్ట్ చూడమని ఆదికి ఇస్తే.. అక్కడ ఇది కూడా నేర్పించారా? అంటూ సెటైర్ వేసేశాడు. ఇలా ప్రతీ సారి ఏదో ఒక పంచ్ వేయడంతో ఆ గతం మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తూనే ఉందన్నారు. గత వారంలో దొరబాబు భార్యను కూడా ఎంట్రీ చేయించారు. భార్య ముందే దొరబాబు పరువుదీసేశాడు ఆది. పంచ్‌ల వర్షం కురిపించడానికి ఇలా వారి జీవితంలో జరిగిన సంఘటనలను వాడుకుంటున్నాడు ఆది. అయితే ఆ పంచ్‌లు బాగా క్లిక్ అవుతుండటంతో బాగానే కంటిన్యూ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: