తన ముఖంపై చాలా మచ్చలుంటాయని చెప్పి షాక్ ఇచ్చిన బ్యూటీఫుల్ యాంకర్ అనసూయ....
తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా ఆమె అద్భుతంగా రాణిస్తుంది. తన యాంకరింగ్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న, వినోదాన్ని పంచుతోన్న అనసూయ.. సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులకు, ఫాలోవర్లకు టచ్‌లో ఉంటుంది. వీటితో పాటు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ ఛానెల్ ద్వారా వంటలు, బ్యూటీ టిప్స్, ఆరోగ్య సూత్రాలను వెల్లడిస్తుంది. అనసూయ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. పార్టీలకు ఆమె ఎలా సిద్ధమవుతుందన్నది ఈ వీడియో ద్వారా అనసూయ చూపించింది. తన స్నేహితురాలి పుట్టినరోజు ఉందని, ఆ చిన్న పార్టీకి తాను సిద్ధమవుతున్నానని ఈ వీడియోలో అనసూయ చెప్పింది. ప్రస్తుత కరోనా సమయంలో గుంపులుగా ఉండటం సరికాదని చెప్పిన అనసూయ.. తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీలో పాల్గొనబోతున్నామని వెల్లడించింది.
అనసూయ తాను ఒక పార్టీకి వెళ్లడానికి సిద్ధమైనప్పుడు కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని. ఆమెకు డ్రెస్‌లో కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. కంఫర్ట్, ఎక్స్పెరిమెంట్.. డ్రెస్‌లో ఈ రెండింటిని అనసూయ ప్రధానంగా తీసుకుంటుందని, పార్టీ అంటే టైట్ డ్రెస్ వేసుకుని, పొట్ట లోపలికి పెట్టుకుని, హై హీల్స్ వేసుకుని రెడీ అవ్వడానికి తాను చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తానని అనసూయ చెప్పటమే కాకుండా సింపుల్‌గా, వెరైటీగా ఉండే బట్టలు వేసుకుంటానని వెల్లడించింది. ఓ వైపు మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తూ తన ముఖంపై చాలా మచ్చలు ఉంటాయని, దగ్గరగా వచ్చి చూస్తే కనిపిస్తాయని అనసూయ తెలిపింది. తన మేనత్తలకు, నానమ్మకు ఇలానే ఉండేవని చెప్పింది. తన చిన్న చెల్లికి అయితే మరీ భయంకరంగా ఉంటాయని అన్నది. దీనికి తోడు తన ముఖంపై ఎప్పుడైనా మొటిమ వస్తే గిచ్చేసుకుంటానని, ముఖంపై ఉన్న మచ్చలన్నీ అవేనని, ఇది తనకున్న చెత్త అలవాటని అనసూయ వెల్లడించింది. కాకపోతే, తాను బీభత్సంగా ఆలోచిస్తూ గిచ్చేసుకుంటూ ఉంటానని.. తనకు తెలియకుండానే జరిగిపోతుందని అన్నది. ఇంట్లో రెడీ అయ్యేటప్పుడు తాను అస్సలు దువ్వెన వాడనని అనసూయ చెప్పింది. ‘నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నా’ అంటూ ఒక్కో విషయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ.