అభిజిత్ కి ముద్దు పెట్టిన దేత్తడి హారిక.. బిగ్ బాస్ హౌస్‌లో ఎఫైర్ల హీట్..!
ఇక ఈ ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా. ఆ ఇద్దరితో పోటీ పడి ఈత కొట్టి హారిక ఇచ్చిన స్ట్రాంగ్ కిస్‌ను బహుమతిగా అందుకున్నారు. అది ఫ్లైయింగ్ కిస్ కాబట్టి సరిపోయింది కాని.. లిప్ కిస్ అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఏ సర్టిఫికేట్ బొమ్మ పడేదని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఫేక్ నామినేషన్స్ సందర్భంగా.. నోయల్‌ని సైతం గట్టిగా ముద్దాడింది హారిక. ఆమె ఎలిమినేట్ అయ్యి వెళ్తుందని తెగ బాధపడిపోతున్న నోయల్‌ని దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది ఈ అమ్మడు. ఇక అభికి సైతం అదే రేంజ్లో హగ్ ఇచ్చింది. అయితే హగ్‌లు కిస్‌లు హారికకు చాలా క్యాజువల్ అనిపించవచ్చు కాని.. చూసే ప్రేక్షకులకు మాత్రం అతిగా అనిపిస్తున్నాయని నెటిజన్స్ అంటున్నారు.
ఇక షోలో మొనాల్‌కి అయితే తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటే అర్థం ఉంది. హారిక మాత్రం ఇంగ్లీష్‌లో తప్పితే తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని నిపుణులు తెలిపారు. పైగా ఆమె వ్యవహార శైలి కూడా ఇంగ్లీష్ వాళ్ల మాదిరే ఉంటటంతో విమర్శలు వస్తున్నాయి. మొనాల్ రేంజ్‌లోనే ఈమెపై కూడా దారుణమైన మీమ్స్ వస్తున్నాయి. ఏదో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వాళ్లలా ప్రవర్తిస్తూ చీటికిమాటికి హగ్‌లు కిస్‌లు అంటూ ఫ్యామిలీతో షో చూసేవారికి ఇబ్బందిగా మారుతుందని నెటిజన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.