దాసరి నారాయణకి దేవి నాగవల్లి ఎం అవుతుందో తెలుసా..?
ఇక నాగవల్లి తల్లి తన కూతురు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం పట్ల ఆనందం వ్యక్తి చేశారు. ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దేవి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది? దాసరి కుటుంబంతో ఉన్న రిలేషన్ ఏంటన్న దానిపై వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా కూతురు దేవి నాగవల్లి ఇంట్లో ఎలా ఉంటుందో.. బిగ్ బాస్ హౌస్‌లో అలాగే ఉందని తెలిపారు. నా కూతురు ఫైటర్ బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఫైట్ చేస్తుందన్నారు. ఆమె తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.
ఇక దాసరి నారాయణ రావు మా అత్తయ్య తమ్ముడని మా ఆయనకు మేనమామ అని దేవికి తాత అవుతారని తెలిపారు. మేం వాళ్ల ఇంటికి వెళ్తూ ఉంటాము అని అన్నారు. ఏదైనా సందర్భం ఉంటే దాసరి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాము. అయితే దాసరి నారాయణ రావుని మేం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని తెలిపారు. ఇక నరసాపురం, పాలకొల్లులో ఆయనకి మాకూ చాలామంది చుట్టాలు ఉన్నారని తెలిపారు. దాసరి నారాయణ రావుగారిది పాలకొల్లే కదా.. చాలాసార్లు కలిసేవాళ్లం అని ఆమె అన్నారు. ఇక దేవి నామినేషన్స్‌లో ఉన్నా ఆమె ఎలిమినేట్ కాదని జనాలు కూడా దేవిని ఆశీర్వదిస్తారని అన్నారు. అంతేకాకుండా జనాలే దేవిని గెలిపిస్తారు’ అంటూ దేవి నాగవల్లి తల్లి చెప్పుకొచ్చారు.