బిగ్ బాస్ స్టార్ కు కరోనా పాజిటివ్...?
సెలబ్రిటీలు ఎంతో జాగ్రత్త వహిస్తున్న... కరోనా వారిని వదిలిపెట్టడం లేదు. మరోవైపు ఎంతకాలమని కరోనాకు భయపడి దాక్కో లేని పరిస్థితిలో షూటింగ్ కి హాజరు అవుతున్నారు నటీమణులు... ఈ తరహాలో ఎంతో మంది కరోనా బాధితులు గా మారుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 13 ఫేం హిమాంశు ఖురానాకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. బిగ్ బాస్ తో ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె తనకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని అందరికీ తెలియజేసింది. విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఖురానా త్వరగా కరోనా నుండి కోలుకొని బయటపడాలని కోరుకుంటున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ముంబయిలో జరిగిన ఆందోళనల్లో ఈమె పాల్గొనడం జరిగింది. రైతు సంఘాల వారికి ఆమె మద్దతు తెలుపుతూ ఈ నిరసనలో పాల్గొన్నారు ఖురానా. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో హిమాంశు పూర్తి జాగ్రత్తలు తీసుకుందట. అయినా కూడా కరోనా వచ్చిందంటూ ఆమె వ్యక్తం చేశారు. అందుకే ఆ సమయంలో తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చారు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోవాంటూ సూచించింది. ఈ సందర్భంగా... ప్రభుత్వం ఈ సమయంలో ఆందోళనలు వద్దంటున్నా కూడా కొందరు ఆందోళనలు నిర్వహిస్తూ వైరస్ ను విస్తరింపజేస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.