ప్రేమ ఎంత మధురం హీరోయిన్ అను గురించి మీకు తెలియని నిజాలు..!

Suma Kallamadi
బుల్లితెరపై వచ్చే ప్రతి సీరియల్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు. అతితక్కువ కాలంలో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సీరియల్ ప్రేమ ఎంత  మధురం.ఇందులో ముఖ్యంగా జి తెలుగులో టాప్ వన్ సీరియల్ గా ప్రేమ ఎంత మధురం పేరు సంపాదించుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ లో హీరోయిన్ అను తన అందంతో, అభినయంతో ఆడియన్స్ కి దగ్గరయింది. పేరుకు కన్నడ అమ్మాయి అయినా తన అభినయం,ఆహార్యం అన్నీ తెలుగు నేటి విటీకి తగ్గట్టు ఉన్నాయి.

ఇక అను రియల్ లైఫ్ లోకి వెళ్తే.. ఈమె అసలు పేరు వర్ష. ఈమె 2001లో కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. అయితే 19ఏళ్ళ వర్ష స్టడీస్ మొత్తం బెంగుళూరులోనే పూర్తి చేసుకుంది. ఇక ఆమె చిన్నతనం నుంచి యాక్టింగ్ మీద మక్కువ ఉండడంతో మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిందని తెలిపారు. ఇక ఈ భామ కన్నడ బుల్లితెరపై నాగమండల సీరియల్ ద్వారా అడుగుపెట్టింది.

అంతేకాదు ఆ సీరియల్ హిట్ కావడంతో కస్తూరి సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. అంతేకాదు ఈ భామ కన్నడంలో నటిస్తున్న సమయంలోనే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించే ఛాన్స్ వర్ష దక్కించుకుందని తెలిపారు. ఇక తన నటనతో తెలుగులో తొలి సిరియల్ తోనే మంచి పేరును గుర్తింపును తెచ్చుకుంది వర్ష. ఇక వర్ష తెలుగు కూడా నేర్చుకుంటోందని తెలిపారు. ఇక అభిమానుల కోరిక మేరకు తల్లితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఫాన్స్ కామెంట్స్ తో అదరగొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: